AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Bikes: ఆ బైక్స్‌కు ఆ’ధర’ణ అందుకే.. మార్కెట్‌లో టాప్ లేపుతున్న బడ్జెట్ బైక్స్ ఇవే..!

కుటుంబంతో సహా బయటకు వెళ్లాలన్నా, ప్రతి రోజూ ఆఫీస్‌కు వెళ్లాలన్నా బైక్ అనేది తప్పనిసరైంది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో నిర్వహణ వ్యయం తక్కువ ఉండే బడ్జెట్ బైక్స్‌ను అందరూ ఇష్టపడుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అన్ని కంపెనీ బడ్జెట్ బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ బడ్జెట్ బైక్స్ వాటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

Budget Bikes: ఆ బైక్స్‌కు ఆ’ధర’ణ అందుకే.. మార్కెట్‌లో టాప్ లేపుతున్న బడ్జెట్ బైక్స్ ఇవే..!
Budget Bikes
Nikhil
|

Updated on: Mar 08, 2024 | 4:35 PM

Share

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే పెరిగిన ఖర్చులతో వారు కుటుంబ పోషణకు ఇబ్బందిపడకూడదనే ప్రతి రూపాయి పొదుపు వాడతారు. ఇటీవల కాలంలో ప్రతి ఇంటికి బైక్ తప్పనిసరైంది. ముఖ్యంగా కుటుంబంతో సహా బయటకు వెళ్లాలన్నా, ప్రతి రోజూ ఆఫీస్‌కు వెళ్లాలన్నా బైక్ అనేది తప్పనిసరైంది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో నిర్వహణ వ్యయం తక్కువ ఉండే బడ్జెట్ బైక్స్‌ను అందరూ ఇష్టపడుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అన్ని కంపెనీ బడ్జెట్ బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ బడ్జెట్ బైక్స్ వాటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు భారతదేశంలోని శ్రామిక మధ్యతరగతికి వెన్నెముకగా మిగిలిపోయాయి ముఖ్యంగా 100-110 సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ దాదాపు అన్ని బ్రాండ్‌ల నుండి ఆఫర్‌లతో వస్తుంది. లివో, హోండా సీడీ 110 డ్రీమ్, టీవీఎస్ రేడియన్, హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్స్ అధిక ప్రజాదరణ పొందాయి. ఈ మోడల్‌లు ఎక్కువగా ప్రాథమిక పరికరాలను కలిగి ఉంటాయి. అయితే హీరో స్ప్లెండర్ ప్లస్ దాని టాప్-స్పెక్ ఎక్స్-టెక్ వేరియంట్‌లో మిగిలిన మోడళ్లను మించిపోయింది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌‌తో వస్తుంది. హార్డ్‌వేర్ పరంగా చూస్తే ఈ స్పోర్టి కమ్యూటర్‌లందరికీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున హైడ్రాలిక్ టైప్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. లివో, రెడాన్ మాత్రమే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఎంపికను పొందుతాయి. అన్ని మోటార్‌సైకిళ్లు ట్యూబ్‌లెస్ టైర్‌లతో వస్తాయి.

హోండా లివో, సీడీ110 డ్రీమ్ అత్యధికంగా 8.67 బీహెచ్‌పీ, 9.30 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తిని అందిస్తాయి. స్ప్లెండర్ ప్లస్ చిన్న ఇంజిన్ డిస్ప్లేస్‌మెంట్ కారణంగా నాలుగు మోడళ్లలో అతి తక్కువ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేసింది. నాలుగు బైక్‌లపై ట్రాన్స్‌మిషన్ విధులు 4 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహిస్తాయి. హోండా లివో ధర రూ.78,812 నుంచి రూ.82,812గా ఉంటుంది. హోండా సీడీ 110 డ్రీమ్ ధర రూ.73,417గాఉంది. టీవీఎస్ రేడియన్ ధర వేరియంట్‌కు రూ.77,518 నుంచి రూ.81,518గా ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ రూ.73,059 నుంచి రూ.79,261 గా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి