ఆ కార్ల కొనుగోలుపై ఏకంగా రూ. 2లక్షలు తగ్గింపు.. మళ్లీ మళ్లీ రావు ఇలాంటి ఆఫర్స్.. వదులుకోవద్దు..
Tata Electric Cars Offer: తన కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఏకంగా రూ. 2లక్షల వరకూ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు పేర్కొంది. టాటా కంపెనీ నుంచి వచ్చిన టాటా నెక్సాన్, టియాగో, టైగోర్ మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు పలు ప్రయోజనాలతో నిండి ఉంటాయని కంపెనీ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్ తో పాటు, కార్పొరేట్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ కింద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అంతా ఇయర్ ఎండింగ్ సేల్స్ నడుస్తున్నాయి. అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై అదిరే ఆఫర్లను అందిస్తున్నాయి. పలు సంస్థలు క్లియరెన్స్ సేల్స్ కూడా నడుపుతున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీలు, టూ వీలర్ల సంస్థలుకూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశంలోని ప్రముఖ కార్ మేకర్ అయిన టాటా మోటార్స్ కూడా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. తన కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఏకంగా రూ. 2లక్షల వరకూ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు పేర్కొంది. టాటా కంపెనీ నుంచి వచ్చిన టాటా నెక్సాన్, టియాగో, టైగోర్ మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు పలు ప్రయోజనాలతో నిండి ఉంటాయని కంపెనీ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్ తో పాటు, కార్పొరేట్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ కింద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే ఈ ఆఫర్లను మిస్ కావొద్దు. త్వరపడండి,ఎందుకంటే ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఉన్న స్టాక్ ను బట్టి ఆఫర్లు ఉంటాయాల లేదా అనేది నిర్ణయిస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. అంతేకాక ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టాటా నెక్సాన్ ఈవీ..
మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇది. టాటా మోటార్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో నెక్సాన్ కొత్త ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను కూడా లాంచ్ చేసింది. అయితే పాత వెర్షన్ అంటే ప్రీ ఫేస్ లిఫ్ట్ నెక్సాన్ అమ్ముడుపోని స్టాక్‌లను క్లియర్ చేసేందుకు ప్రైమ్, మాక్స్ వేరియంట్‌లలో అద్భుతమైన ఆఫర్లను కంపెనీ అందస్తోంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్‌పై ఏకంగా రూ. 2.6 లక్షల తగ్గింపును అందిస్తోంది. టాటా కంపెనీకి చెందిన ఈవీల్లో ఇదే ఇప్పుడు చాలా తగ్గింపు ధరకు లభిస్తోంది. నెక్సాన్ ప్రైమ్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ.1.9 లక్షలు తగ్గింపును పొందుతారు. దీనిలో రూ.1.4 లక్షల నగదు, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వస్తుంది. అలాగే నెక్సాన్ మ్యాక్స్ వెర్షన్ పై రూ. 50,000 ఎక్స్ చేంజ్ బోనస్ తో పాటు రూ.2.1 లక్షల నగదు తగ్గింపును పొందొచ్చు. ఈ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు అయిన నెక్సాన్ ప్రైమ్, మ్యాక్స్ ట్రిమ్‌లు రూ. 14.5 లక్షలు- రూ.17.19 లక్షలు, రూ.16.49 లక్షలు- రూ.19.54 లక్షల ఎక్స్ షోరూం ధరలను కలిగి ఉన్నాయి.
టాటా టైగోర్ ఈవీ..
టాటా మోటార్స్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లో భాగంగా ఈ టాటా టైగోర్ ఈవీపై రూ. 1.1లక్షల తగ్గింపు ను పొందొచ్చు. దీనిలో రూ. 50,000 నగదు తగ్గింపు కాగా.. ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 60 వరకూ పొందొచ్చు. దీని బేస్ ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75లక్షల వరకూ ఉంది.
టాటా టియాగో ఈవీ..
టాటా మోటార్స్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లో భాగంగా ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు పై రూ. 77,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ. 55,000 క్యాష్ తగ్గింపు కాగా.. గ్రీన్ బోనస్ గా రూ. 15,000, రూ. 7000 విలువైన కార్పొరేట్ తగ్గింపులు ఉంటాయి. ఈ మోడల్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 8.69 లక్షలు నుంచి రూ.12.04 లక్షల మధ్య ఉంది.
ఇది గుర్తుంచుకోండి.. ఈ డిస్కౌంట్‌లు దేశంలో అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. అందుబాటులో ఉన్న స్టాక్ లభ్యతకు లోబడి ఉంటాయని కొనుగోలుదారులు గమనించాలి. అందువల్ల, మీకు కచ్చితమైన వివరాలు తెలియాలంటే టాటాకు చెందిన స్థానిక డీలర్‌ను సంప్రదించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..