Kia EV9: కొత్త ఏడాది మార్కెట్‌లోకి కియా నయా కారు ఎంట్రీ.. షాకింగ్‌ ఫీచర్స్‌తో గ్రాండ్‌గా లాంచ్‌

కొరియన్‌ ఆటో దిగ్గజం కియా తన మూడు వరుసల ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈవీ 9 2024లో భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ధ్రువీకరించింది. వచ్చే ఏడాది తన భారతదేశ ప్రణాళికలను వెల్లడిస్తూ కొత్త తరం కార్నివాల్‌తో పాటు ఈవీ 9ను విడుదల చేస్తున్నట్లు కార్‌ మేకర్‌ పేర్కొంది. ప్రస్తుతం టాటా మోటర్స్‌ ఆధిపత్యంలో ఉన్న భారతదేశంలో ప్రయాణికులు ఈవీ విభాగంలో సుమారు 15 శాతం మార్కెట్‌ వాటాను సాధించాలనే ఈవీ9 కీలకంగా ఉంటుందని తెలిపింది.

Kia EV9: కొత్త ఏడాది మార్కెట్‌లోకి కియా నయా కారు ఎంట్రీ.. షాకింగ్‌ ఫీచర్స్‌తో గ్రాండ్‌గా లాంచ్‌
Kia Ev9
Follow us
Srinu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 19, 2023 | 8:30 PM

భారతదేశంలో ఈవీ వాహనాల డిమాండ్‌ నేపథ్యంలో కియా కంపెనీ కొత్త కారును రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. కొరియన్‌ ఆటో దిగ్గజం కియా తన మూడు వరుసల ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈవీ 9 2024లో భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ధ్రువీకరించింది. వచ్చే ఏడాది తన భారతదేశ ప్రణాళికలను వెల్లడిస్తూ కొత్త తరం కార్నివాల్‌తో పాటు ఈవీ 9ను విడుదల చేస్తున్నట్లు కియా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.  ప్రస్తుతం టాటా మోటర్స్‌ ఆధిపత్యంలో ఉన్న భారతదేశంలో ప్రయాణికులు ఈవీ విభాగంలో సుమారు 15 శాతం మార్కెట్‌ వాటాను సాధించాలంటే ఈవీ9 కీలకంగా ఉంటుందని తెలిపింది. కాబట్టి కియా ఈవీ9 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కియా ఈవీ9 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌ రూపంలో గతంలో భారతదేశంలో ప్రదర్శించారు. కియా హోమ్‌ బేస్‌ దక్షిణ కొరియాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మార్కెట్స్‌లో రిలీజ్‌ చేశారు. అయితే గతంలో కియా 2025 నాటికి భారతదేశంలో ఈవీ9 రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించినా తాజాగా ఈ కారును 2024లోనే లాంచ్‌ చేస్తున్నట్లు వివరించింది. అయితే 2025 నాటికి మాత్రం మూడు కొత్త ఈవీలను లాంచ్‌ చేస్తామని మాత్రం కియా ప్రతనిధులు వెల్లడిస్తున్నారు. ఇక కియా ఈవీ 9 విషయానికి వస్తే ఈ కారు ఎలక్ట్రిక్‌ గ్లోబల్‌ మాడ్యులర్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పని చేస్తుంది. కియా మొదటి కారు అయిన కియా ఈవీ 6 కంటే ఈవీ9 పొడవు 5 మీటర్లు ఎక్కువ. ఈ కారు గ్లోబల్‌ ఎస్‌యూవీ టెల్లూరైడ్‌తో పోల్చుకుంటే సమాన నిష్పత్తిలో ఉంటుంది. ఈ కారు ఆరు లేదా ఏడు సీట్ల కాన్ఫిగేరేషన్‌లతో వస్తుంది. ఈ కారు ఫీచర్ల గురించి ఆటో మొబైల్‌ రంగ నిపుణులు ఏం చెబుతున్నారో? ఓసారి తెలుసుకుందాం.

కియా కంపెనీ తెలుపుతున్న వివరాల ప్రకారం ఈవీ 9 కారు 541 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కారు 150 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్‌ మోటర్‌తో పనిచేయడం వల్ల 9.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. కియా ఈవీ 9 ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌ ద్వారా ఆకట్టుకుంటుంది. ఈవీ 800 వోల్ట్‌ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కెపాసిటీతో వస్తుంది. కాబట్టి ఈ కారును కేవలం 15 నిమిషాలు చార్జింగ్‌తో 239 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. కియా ఈవీ 9 జీటీ హైవేలపై హ్యాండ్‌ ఫ్రీ రైడింగ్‌ను అందించే 3 ఏడీఏఎస్‌ను అందిస్తుంది. అలాగే ఈ కారను 360 డిగ్రీ వ్యూయింగ్‌ కోసం ఏడీఏఎస్‌ కారు చుట్టూ రెండు లైడార్‌, రాడార్‌, కెమెరాలతో సహా 15 సెన్సార్ల ద్వారా సాయం చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు