- Telugu News Photo Gallery Kia makes special vehicles for AP police cars, showcases them at AP Police Headquarters
AP Police New Car: హాలీవుడ్ మూవీస్ రేంజ్‌లో ఏపీ పోలీసుల కార్లు.. కియా సంస్థ ప్రత్యేక వాహనాల తయారీ.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉన్న కియా వాహనాల కార్ల పరిశ్రమ.. తాజాగా ఏపీ పోలీసుల కోసం ప్రత్యేక వాహనాలను తయారు చేసింది. హాలీవుడ్ మూవీస్ రేంజ్‌లో ఉన్న ఈ కార్లను గురువారం కియా ప్రతినిధులు డీజీపీకి చూపించారు..
Updated on: Apr 20, 2023 | 6:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల కోసం కియా సంస్థ ప్రత్యేకంగా వాహనాలను రూపొందించింది. దేశంలో ఇలా పోలీసులకు ప్రత్యేకంగా కార్లను తయారు చేయడం ఇదే తొలిసారి.

అత్యాధునిక సదుపాయాలతో దేశవ్యాప్తంగా పోలీసుల కోసం కియా పెట్రోలింగ్ వాహనాలను సిద్ధం చేస్తోంది. పోలీస్ శాఖ కోసం ఇంటర్ సెప్టార్ తో పాటు పెట్రోలింగ్ వాహనాలను సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా కియా రెండు కార్లను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. దీనిని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి కియా ప్రతినిధులు చూపించారు. పెట్రోలింగ్, ఇంటర్ సెపటర్స్ ను డీజీపీ ఈ సందర్భంగా పరిశీలించారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ వాహనాలను సిద్ధం చేసినట్లు కియా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

పోలీసుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాల్లో ఇంకా అదనపు సౌకర్యాలను కూడా సమకూర్చేటందుకు కియా సంస్థ డీజీపీ సూచనలను తీసుకుంది.

ఇదిలా ఉంటే వాహనాలను చూసిన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన మరిన్ని సౌకర్యాలను కూడా కల్పించేందుకు కియా సంస్థ సిద్ధంగా ఉందని వారు తెలిపారు.





























