Stock Market: బుల్‌ రన్‌.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. చాలా రోజుల తర్వాత..

స్టాక్‌మార్కెట్లలో బుల్‌ రన్‌. యస్... దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. పాజిటివ్‌ సెంటిమెంట్‌తో పరుగులు పెట్టాయి. 1397 పాయింట్ల లాభంతో 78,583 దగ్గర సెన్సెక్స్ ముగియగా.. 378 పాయింట్ల లాభంతో 23,739 దగ్గర నిఫ్టీ ముగిసింది.. ఇంతకు లాభాల వెనుక కారణాలేంటి...? ఇక నుంచి మార్కెట్లు ఎలా ఉండనున్నాయ్...? స్టాక్ మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Stock Market: బుల్‌ రన్‌.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. చాలా రోజుల తర్వాత..
Stock Market
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2025 | 8:26 PM

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1450 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 23,750 మార్కును అందుకుంది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 1450 పాయింట్లు లాభపడి 78,658.59 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1397.07 పాయింట్ల లాభంతో 78,583.81 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 378.20 పాయింట్ల లాభంతో 23,739.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.07గా కొనసాగుతోంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5.5 లక్షల కోట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ వార్ కు కాస్త బ్రేక్ ఇవ్వడంతో మార్కెట్లో ఫుల్ జోష్ వచ్చింది. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించడంతో ట్రేడ్ వార్ మొదలైందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి.

ఆసియా మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే తాజాగా ట్రేడ్ వార్ ను 30 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్యంలో తాత్కాలిక ఉపశమనం కలిగినట్లైంది. దీంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..