SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. సరికొత్త సేవలు అందుబాటులోకి.. వారికి ఊరట …

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా అందుబాటులో

SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. సరికొత్త సేవలు అందుబాటులోకి.. వారికి ఊరట ...
Sbi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2021 | 8:26 AM

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను తీసుకువస్తూ.. ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా.. వికలాంగులకు, విద్యార్థులకు, మహిళలకు పలు రకాల సేవలు అందిస్తున్న ఎస్బీఐ తాజాగా అన్నదాతల కోసం సరికొత్త సేవలను అందిస్తోంది. రైతుల కోసం ఎస్బీఐ పలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

రైతులు ఇకపై కిసాన్ రివ్యూ కోసం బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే ఆ పని పూర్తి చేసుకోవచ్చు. ఎస్బీఐలో ఖాతా ఉన్న రైతులు తమ కేసీసీ రివ్యూ కోసం బ్యాంక్ బ్రాంచు వరకు వెళ్లాల్సిన పని లేదని.. ఇంటి నుంచే మీ ఖాతాను సమీక్షించుకోవచ్చని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. కానీ రైతులు తమ కేసీసీ రివ్యూ కోసం ముందుగా యోనో యాప్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్ ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. కేంద్రం రైతులకు సులభంగా రుణాలు అందించాలనే ఉద్దేశ్యంతో కేసీసీ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ట్వీట్..

Also Read: Bigg Boss: బిగ్‏బాస్‏లోకి మరో అందాల తార.. తెరపైకి జాంబిరెడ్డి బ్యూటీ..

Mahesh Babu: మహేష్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన థమన్.. సూపర్ స్టార్ పక్కనే విజయ్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..

Salaar Movie: శరవేగంగా ‘సలార్’ షూటింగ్.. నైట్ యాక్షన్ షాట్‎కు సిద్ధమైన ప్రభాస్..

SR Kalyana Mandapam: ‘ఎస్ఆర్. కళ్యాణ మండపం’ సినిమాకు ఫైరసీ ఎఫెక్ట్.. వైబ్‏సైట్‏లలో ఫుల్ మూవీ..