Silver Price: కుప్పకూలబోతున్న వెండి ధర..! కొనుగోలుదారులు బీ అలర్ట్.. మార్కెట్ నిపుణుల హెచ్చరిక..?
వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరినా, 2027 నాటికి 60% పతనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్ తగ్గడం, ప్రత్యామ్నాయాల వాడకం పెరుగుదల దీనికి కారణం. ఎలాన్ మస్క్ కూడా భారీ తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. రిటైల్ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దని సలహా ఇస్తున్నారు.

వెండి ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. కొద్ది నెలలుగా వెండి కూడా బంగారంతో పోటి పడుతూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్, ఉత్పత్తి మధ్య అంతరం కారణంగా 2025 వరకు వెండి ధరలు దాదాపు 180 శాతం పెరిగినట్టు అంచనా. అయితే, 1980- 2011లో వెండి ధరలు గణనీయమైన పెరుగుదల తర్వాత తగ్గుదల నమూనాను చవిచూశాయి. ఇలాంటి తగ్గుదల మళ్లీ ఊహించవచ్చా అని పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే 2027 ఆర్థిక సంవత్సరం నాటికి వెండి ధరలు 60 శాతం తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వెండి ధరల్లో వేగవంతమైన పెరుగుదల, ఉత్పత్తి, సరఫరా తగ్గుదల ఇప్పుడు పారిశ్రామిక డిమాండ్‌ను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక వినియోగం పెరగడం వెండి ధరలకు బలమైన మద్దతునిచ్చింది. లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి సాలిడ్-స్టేట్ బ్యాటరీల వైపు ప్రపంచ పారిశ్రామిక రంగం వెళుతున్న నేపథ్యంలో వెండి వినియోగం పెరుగుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ కారణంగానే అనేక పరిశ్రమలు వెండికి ప్రత్యామ్నాయాలను పరిశీలించడం ప్రారంభించాయి.
కొన్ని ప్రదేశాలలో, వెండిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి రాగి వంటి పదార్థాల వాడకాన్ని పెంచుతున్నారు. వెండి డిమాండ్‌లో గణనీయమైన భాగం పారిశ్రామిక డిమాండ్ నుండి వస్తుంది. పరిశ్రమ ఇతర ప్రత్యామ్నాయాలకు మారితే, వెండి ధరలు తగ్గవచ్చు అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. వెండి ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా కంపెనీలు రాగిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, తైవాన్, ఇజ్రాయెల్‌లోని కొన్ని కంపెనీలు ఘన-స్థితి బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో రాగి వాడకాన్ని పెంచుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ ప్రకారం, వెండి ధరల్లో ప్రస్తుత పెరుగుదల కొంతకాలం పాటు కొనసాగవచ్చునని, ఔన్సుకు $100 కి చేరుకోవచ్చు. అయితే, ఆ తర్వాత తీవ్ర తగ్గుదల ప్రమాదం ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వెండి ధరలు ఔన్సుకు దాదాపు $40 కి తగ్గవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రిటైల్ పెట్టుబడిదారులు వెండి కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ధరల స్థిరత్వాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అధిక లాభాల ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




