AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunday Remedies: డబ్బు నిలవడం లేదా? ఆదివారం ఈ పరిహారం చేస్తే అదృష్టం మారుతుంది..లక్ష్మీదేవి కటాక్షం!

సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి ఒక ఖచ్చితమైన మార్గం ప్రత్యేక దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఆదివారం నాడు సూర్యదేవుడిని పూజించడంతో పాటు బెల్లం, గోధుమలు, నూనె, ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని మత విశ్వాసం. వీటినే ఎందుకు దానం చేయాలి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

Sunday Remedies: డబ్బు నిలవడం లేదా? ఆదివారం ఈ పరిహారం చేస్తే అదృష్టం మారుతుంది..లక్ష్మీదేవి కటాక్షం!
Sunday Remedies
Jyothi Gadda
|

Updated on: Jan 04, 2026 | 6:58 AM

Share

హిందూ మతంలో ఆదివారం సూర్యభగవానుని రోజుగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వం, గౌరవం, విజయానికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే సూర్యుని స్థానం బలంగా ఉంటుందో వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అందుకే సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి ఒక ఖచ్చితమైన మార్గం ప్రత్యేక దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఆదివారం నాడు సూర్యదేవుడిని పూజించడంతో పాటు బెల్లం, గోధుమలు, నూనె, ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని మత విశ్వాసం. వీటినే ఎందుకు దానం చేయాలి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..కొందరి జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు ఏ పని చేసినా.. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం అందకుండా పోతుంది. అలాంటి వారు చింతించాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో సూర్య భగవానుడి ఆశీస్సులో కోసం ఆదివారం రోజున కొన్ని పరిహారాలను కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. జ్యోతిశాస్త్రం ప్రకారం.. బెల్లం, గోధుమలు సూర్యునితో సంబంధం ఉన్న శుభ వస్తువులుగా పరిగణిస్తారు. దానం చేయడం, సమర్పించడం, వాటిని నైవేద్యాలలో ఉపయోగించడం వల్ల సూర్యుడు బలపడతాడు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ రెండు వస్తువులు ఇంటికి సానుకూల శక్తిని తెస్తాయని, ప్రతికూల శక్తులను తరిమికొడతాయని, ఒకరి అదృష్టాన్ని బలోపేతం చేస్తాయని నమ్ముతారు.

ఆదివారం తమ కోరికలన్నీ నెరవేరాలనుకునే వారికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, గోధుమలు, బెల్లంను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి, పేద వారికి లేదా బ్రాహ్మణుడికి దానం చేయండి. ఈ పరిహారం అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తయ్యేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ప్రభుత్వ పనులలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయని, జీవితంలో కొత్త విజయాలకు తలుపులు తెరుస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో ఒక రాగి పాత్రలో నీటిని నింపి, అందులో బెల్లం, ఎర్ర చందనం, ఎర్రటి పువ్వులు కలిపి సూర్యుడికి సమర్పించండి. తరువాత, గోధుమ పిండితో చేసిన చపాతీ లేదా లడ్డును సూర్య భగవానుడికి సమర్పించి దానిని ప్రసాదంగా తినండి. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తారు. ఒక ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు ఒక చిన్న బెల్లం ముక్క తిని, నీళ్లు తాగడం శుభప్రదమని జ్యోతిష్యం చెబుతోంది. ఇది ఆ పనిలో విజయాన్ని కలిగిస్తుంది.

కుటుంబంలో తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు, సంఘర్షణలు లేదా ఏ రకమైన మానసిక అశాంతి ఉన్న కూడా ఒక ప్రత్యేక నివారణను పాటించాలని నమ్ముతారు. అందుకోసం వరుసగా మూడు ఆదివారాలు పవిత్ర నది ప్రవహించే నీటిలో ఒకటిన్నర కిలోల బెల్లం ముంచండి. ఈ పరిహారం కుటుంబ సంబంధాలలో సామరస్యాన్ని తీసుకురావడానికి, గతంలోని బాధలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు
తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!
తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!
బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్
బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్
ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!
గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!
Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా..
Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా..
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ 5 కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న..
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ 5 కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న..
వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఏ రోజుల్లో
వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఏ రోజుల్లో
లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌!
లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌!
వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్..
వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్..