Purnima 2026 Date: 2026 సంవత్సర పౌర్ణమి తిథులు.. నెలవారీ పూర్తి వివరాలు.. స్పెషల్ ఏంటంటే..
పౌర్ణమి లక్ష్మీ దేవి జన్మదినం. ఈ రోజున చంద్రుడు పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు. ఈ రోజున సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. చంద్రున్ని ప్రార్థించటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసేవారి పాపాలు తొలగిపోతాయని కూడా చెబుతారు.

Pournami 2026 Date: హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజును ఒక పండుగలా జరుపుకుంటారు. పౌర్ణమి తిథి రోజున ఆధ్యాత్మిక సాధనలు, పూజలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. పూర్ణిమ తిథి రోజున చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి, సత్యనారాయణుడు, చంద్రుడిని పూజించడానికి ప్రత్యేకమైనది. ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి, ఈ కొత్త యేడాదిలో 2026లో నెల వారీగా పౌర్ణమి తిథి తేదీలు ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి సంవత్సరం 12 పౌర్ణమిలు జరుపుకుంటారు. కానీ 2026 లో అదనపు నెల కారణంగా 13 పౌర్ణమిలు వచ్చాయి. పౌర్ణమి లక్ష్మీ దేవి జన్మదినం. ఈ రోజున చంద్రుడు పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు. ఈ రోజున సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. చంద్రున్ని ప్రార్థించటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసేవారి పాపాలు తొలగిపోతాయని కూడా చెబుతారు.
2026 పౌర్ణమి తేదీలు:
2026 జనవరి 3 శనివారం – పుష్య శుక్ల పౌర్ణమి
2026 ఫిబ్రవరి 1 ఆదివారం – మాఘ శుక్ల పౌర్ణమి
2026 మార్చి 3 మంగళవారం – ఫాల్గుణ శుక్ల పౌర్ణమి
2026 ఏప్రిల్ 1 బుధవారం – చైత్ర శుక్ల పౌర్ణమి
2026 మే 1 శుక్రవారం – వైశాఖ శుక్ల పౌర్ణమి
2026 మే 30 శనివారం- జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి
2026 జూన్ 30 బుధవారం – ఆషాఢ శుక్ల పౌర్ణమి
2026 ఆగస్టు 27 గురువారం – శ్రావణ శుక్ల పౌర్ణమి
2026 సెప్టెంబర్ 26 శనివారం – భాద్రపాద శుక్ల పౌర్ణమి
2026 అక్టోబర్ 25 ఆదివారం – ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి
2026 నవంబర్ 24 మంగళవారం – కార్తీక శుక్ల పౌర్ణమి
2026 డిసెంబర్ 23 బుధవారం – మార్గశిర శుక్ల పౌర్ణమి
పౌర్ణమి అనేది చంద్ర మాసంలో అత్యంత ప్రకాశవంతమైన రాత్రి. పౌర్ణమి ఒక ఖగోళ దృగ్విషయం అయినప్పటికీ, ఇది భూమి, పర్యావరణం, జీవ ప్రపంచం వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ రోజున పౌర్ణమి స్థిరత్వం, మనస్సు స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ రోజున ధ్యానం, ఆధ్యాత్మిక సాధన మనస్సు అశాంతిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
పౌర్ణమి రోజున గంగా, ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది శారీరక, మానసిక శుద్ధికి ఒక సాధనంగా పరిగణించబడుతుంది. నిజానికి, ఈ రోజున నీటిలోని దైవిక శక్తి మరింత చురుకుగా ఉంటుంది. ఇది ఒక వ్యక్తి పాపాలను, దోషాలను కడిగివేస్తుందని పండితులు చెబుతుంటారు. పౌర్ణమి రోజున ఉపవాసం, ధ్యానం చేయడం మానసిక, శారీరక శుద్ధికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పౌర్ణమి దైవిక శక్తి మనస్సు, శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇంకా, పౌర్ణమి రోజున పూజించడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




