Power Banks: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ఏరియాల్లో పవర్ బ్యాంక్‌లు వాడటం బ్యాన్..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో పవర్ బ్యాంక్‌లు వాడటాన్ని నిషేధించింది. ఈ మేరకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు ఎవ్వరూ విమానాల్లో ప్రయాణించే టైమ్‌లో వాడవద్దని, ఈ మేరకు విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది

ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కోసం చాలామంది పవర్ బ్యాంక్‌లు వాడుతూ ఉంటారు. దూరపు ప్రయాణాలు చేయాలనుకునే సమయంలో ఖచ్చితంగా వీటిని తమతో పాటు తీసుకెళ్తాంటారు. ప్రయాణాల సమయాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఇలాంటి సమయంలో వెంటనే పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేవాళ్లల్లో ఎక్కవమంది పవర్ బ్యాంక్ వాడుతూ ఉంటారు. అయితే అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్న సమయంలో వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విమానాల్లో బంద్
విమానాల్లో పవర్ బ్యాంక్ వాడకాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నిషేధించింది. విమానాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లను వాడొద్దని తెలిపింది. అలాగే విమానాల్లోని ఎలక్ట్రిక్ ప్లగ్‌లకు కూడా పవర్ బ్యాంక్‌లను కనెక్ట్ చేయడాన్ని కూడా బ్యాన్ చేసింది. కేవలం హ్యాండ్ బ్లాగుల్లో మాత్రమే వీటిని ఉంచుకోవాలని, విమానాల్లోని ఓవర్ హెడ్ బిన్‌లలో ఉంచవద్దని డీజీసీఏ ప్రయాణికులకు సూచించింది. పవర్ బ్యాంకుల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీల వద్ద ఇటీవల విమానాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో డీజీసీఏ ఈ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ కొత్త రూల్స్‌కు సంబంధించి విమానయాన సంస్థలు కస్టమర్లకు తెలిసేలా ప్రకటనలు చేయాలని డీజీసీఏ సర్క్యూలర్ జారీ చేసింది. ప్రయాణికులు తీసుకొచ్చే లిధియం బ్యాటరీలతో నడిచే పరికరాల వల్ల సంభవించే ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
లిథియం బ్యాటరీకి సంబంధించి అన్ని భద్రతా సమస్యలు, సంఘలను విమానయాన సంస్థలు తెలపాలని డీజీసీఏ సూచించింది. ఎమిరేట్స్, సింగపూర్‌తో పాటు చాలా దేశాల ఎయిర్‌లైన్స్ గత సంవత్సరం పవర్ బ్యాంక్‌లను ప్రయాణికులు ఉపయోగించడంపై నిషేధం విధించాయి. ఇప్పుడు భారత్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. లిథియం బ్యాటరీలు చాలా శక్తివంతమైనవి. వీటి వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. నాణ్యత లేని, పాత బ్యాటరీలు ఉపయోగించడం వల్ల ప్రమాదం జరగొచ్చు. వివిధ రీఛార్జబుల్ పరికారాల్లో ఈ బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మంటలను త్వరగా వ్యాప్తి చేస్తాయి. బ్యాగుల్లో ఉంచిన లిథియం బ్యాటరీలను అధికారులు గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. దీని వల్ల మంటలు వ్యాపించి ప్రమాద తీవ్రత పెరగొచ్చు. దీంతో చెకింగ్ టైమ్‌ల లిథియం బ్యాటరీలతో కూడిన పరికరాలను గుర్తిస్తే వెంటనే సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీజీసీఏ సూచించింది. ఈ నిబంధనలను అన్నీ విమానయాన సంస్థలు అమలు చేయాలని ఆదేశించింది.
