Ather Rizzta: ఆ ఏథర్ స్కూటర్‌లో అదరగొడుతున్న సెఫ్టీ ఫీచర్లు.. ఆకర్షిస్తున్న నయా సెన్సార్లు

భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం ప్రజాదరణను పొందాయి. ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కానీ ఇప్పటికీ అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు.

Ather Rizzta: ఆ ఏథర్ స్కూటర్‌లో అదరగొడుతున్న సెఫ్టీ ఫీచర్లు.. ఆకర్షిస్తున్న నయా సెన్సార్లు
Ather Rizta
Follow us

|

Updated on: Sep 06, 2024 | 4:15 PM

భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం ప్రజాదరణను పొందాయి. ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కానీ ఇప్పటికీ అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సెఫ్టీ ఫీచర్స్‌ను యాడ్ చేస్తున్నారు. తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఏథర్ రిజ్టా స్కూటర్‌కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఏథర్ రిజ్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఏథర్ ఎనర్జీ తన స్కూటర్‌లో భద్రతా ఫీచర్‌ను జోడించింది. ముఖ్యంగా ఈ అప్‌డేట్ బండి స్కిడ్ కాకుండా కాపాడుతుంది. ఏథర్ స్కూటర్ అడ్వాన్స్‌డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ (ఏఆర్ఏఎస్)ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్‌కు సంబంధించిన భద్రతను పెంచుతుంది. ఏఆర్ఏఎస్‌లో స్కిడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్ ఫీచర్‌లు చేర్చామని ఏథర్ ప్రతినిధులు చెబుతున్నారు. స్కిడ్ కంట్రోల్ ఫీచర్‌లో భాగంగా టార్క్‌ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా టైర్ రోడ్డుతో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.

ఈ ఫీచర్ రోడ్డుపై ఇసుక ఉన్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవశాత్తూ పడిపోయే సమయంలో కాపాడుతుంది. ఈ కొత్త సేఫ్టీ ఫీచర్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్‌లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.  ఫాల్ సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతోందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్‌ అవుతుంది. దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్‌‌గా తగ్గుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి