AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: పైసా ఖర్చు లేకుండానే నెలకు రూ. లక్ష సంపాదన.. ఎలాగంటారా.!

మీ ఇంటి పైకప్పు ఖాళీగా ఉందా.! ఆ ఖాళీ స్థలాన్ని విలువైన ఆస్తిగా వినియోగించుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండానే నెలకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. అదెలాగని ఆలోచిస్తున్నారా.?

Business Ideas: పైసా ఖర్చు లేకుండానే నెలకు రూ. లక్ష సంపాదన.. ఎలాగంటారా.!
Money
Ravi Kiran
|

Updated on: Sep 06, 2024 | 12:26 PM

Share

మీ ఇంటి పైకప్పు ఖాళీగా ఉందా.! ఆ ఖాళీ స్థలాన్ని విలువైన ఆస్తిగా వినియోగించుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండానే నెలకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. అదెలాగని ఆలోచిస్తున్నారా.? చేయాల్సిందల్లా మీ ఇంటి పైకప్పుపై మొబైల్ టవర్ ఏర్పాటు చేయడమే..! దీనికోసం మీరు నేరుగా మొబైల్ టవర్ కంపెనీలను ఇన్‌స్టాలేషన్‌ కోసం సంప్రదించవచ్చు.

స్థలం ఎంత ఉండాలంటే..!

2000 చదరపు అడుగుల ఖాళీ స్థలంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేసుకోవచ్చు. మీ భవనం పైకప్పుపై టవర్‌ను అమర్చాలంటే, కనీసం 500 చదరపు అడుగుల స్థలం అవసరం. మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీలో మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, బిల్డింగ్ కనస్ట్రక్షన్ సేఫ్టీ సర్టిఫికెట్ అవసరం. అంతేకాకుండా ఆ స్థలానికి 100 మీటర్ల దూరంలో ఎలాంటి ఆసుపత్రులు, పాఠశాలలు లేదా విద్యాసంస్థలు లేవని నిర్ధారించుకోవాలి.

దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించాలనుకునే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ సేవలను అందిస్తాయి. మీరు నేరుగా ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలను సంప్రదించవచ్చు. మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేసుకుని అద్దె రూపంలో రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. MTNL, Tata Communication, GTL Infrastructure, Indus Towers, American Tower Company India Limited, HFCL Connect Infrastructure వంటి కంపెనీల్లో ఇలాంటి అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.