AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW CE 02: ఆకర్షిస్తున్న బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్.. మతిపోయే మైలేజ్ ఈ స్కూటర్ సొంతం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ రంగాన్ని ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ శాసిస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ లభ్యత తగ్గుతున్న కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో నడిచే వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అన్ని కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈవీ స్కూటర్లను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఈవీ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. క్రమేపి గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈవీ స్కూటర్లకు అలవాటు పడుతున్నారు.

BMW  CE 02: ఆకర్షిస్తున్న బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్.. మతిపోయే మైలేజ్ ఈ స్కూటర్ సొంతం
Bmw Ce 02
Nikhil
|

Updated on: Sep 06, 2024 | 4:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ రంగాన్ని ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ శాసిస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ లభ్యత తగ్గుతున్న కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో నడిచే వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అన్ని కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈవీ స్కూటర్లను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఈవీ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. క్రమేపి గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈవీ స్కూటర్లకు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి ప్రీమియం కంపెనీల వరకు ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రీమియం ఆటోమొబైల్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ ఇటీవల బీఎండబ్ల్యూ సీఈ 02 ఈవీ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌కు సంబంధించిన ఇటీవల కీలక అప్‌డేట్ ప్రకటించింది. త్వరలోనే ఈ స్కూటర్‌ను భారత్‌లో కూడా లాంచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బీఎండబ్ల్యూ కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వారి సీఈ02 గురించి కీలక పోస్ట్ చేసింది. ఈ పండుగ సీజన్‌లోనే భారతదేశంలో ఈ స్కూటర్ లాంచ్ కానుంది. ముఖ్యంగా బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్లు టీవీఎస్ సహకారంతో తమిళనాడులోని హోసూర్‌లో తయారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గతేడాదే అధికారికంగా ప్రకటించారు. అలాగే బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్ సూపర్ స్టైలిష్ లుక్‌తో అందుబాటులో ఉంటుంది. ముందు వైపు యూఎస్‌డీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు ఆకట్టకుంటాయి. అలాగే పొడవైన వీల్‌బేస్, ఫంకీ సైడ్ బాడీ ప్యానెల్‌లు ఈ స్కూటర్ ఎక్కడకు వెళ్లినా దాని ప్రత్యేకతను నిలుపుకుంటుంది. ముఖ్యంగా స్టైలిష్ సిగ్నల్ లైట్స్ ఆకర్షిస్తున్నాయి. 

బీఎండబ్ల్యూ సీఈ 02 పొడవైన సింగిల్-సీటర్ లాగా కనిపిస్తుంది. ఈ స్కూటర్‌లో టైప్-సి ఛార్జర్, 3.5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు కీలెస్‌ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని నిపుణులు అంచలనా వేస్తున్ానరు. భారత మార్కెట్‌కు సంబంధించి పవర్‌ట్రెయిన్ గురించి అధికారిక సమాచారం లేదు. అయితే గ్లోబల్ మోడల్ ఆధారంగా చూస్తే బీఎండబ్ల్యూ సీఈ 02 రెండు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తుంది. ఒక్కో బ్యాటరీ 2 కేడబ్ల్యూహెచ్ పవర్‌తో వస్తుంది. ముఖ్యంగా ఒక్కో బ్యాటరీ 90 కిమీ మైలేజ్ అందిస్తుంది. అలాగే 15 బీహెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్ పుట్‌‌తో వచ్చే ఈ స్కూటర్‌ గంటకు 95 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకువెళ్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి