క్రేజీ లుక్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న హీరో కొత్త స్కూటర్.. టీజర్లో ఆశ్చర్యకర అంశాలు..

ఇప్పుడు హీరో మరో కొత్త మోడల్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. హీరో డెస్టినీ 125కు కొత్త సొబగులు అద్దుతూ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. టీజర్లో కనిపించిన స్టిక్కరింగ్ ప్రకారం ఈ కొత్త స్కూటర్ పేరు హీరో డెస్టినీ 125 ఎక్స్ టెక్ అని తెలుస్తోంది.

క్రేజీ లుక్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న హీరో కొత్త స్కూటర్.. టీజర్లో ఆశ్చర్యకర అంశాలు..
2024 Hero Destini 125
Follow us

|

Updated on: Sep 06, 2024 | 4:15 PM

మార్కెట్లో స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో హోండా ఆధిపత్యం చెలాయిస్తోందని చెప్పాలి. హోండా యాక్టివా ఎక్కువ సేల్స్ రాబడుతోంది. దేశంలో టాప్ పొజిషన్లో ఉంది. హీరో నుంచి కూడా పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్లెజర్, డెస్టినీ వంటివి ఉన్నాయి. ఇవి ఆశించినంతగా క్లిక్ కాలేదు. ప్లెజర్ కొంత మేర అంచనాలకు అందుకున్నా.. మిగిలిన మోడళ్లు మార్కెట్లో అంత రాణించలేదు. ఇప్పుడు హీరో మరో కొత్త మోడల్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. హీరో డెస్టినీ 125కు కొత్త సొబగులు అద్దుతూ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. టీజర్లో కనిపించిన స్టిక్కరింగ్ ప్రకారం ఈ కొత్త స్కూటర్ పేరు హీరో డెస్టినీ 125 ఎక్స్ టెక్ అని తెలుస్తోంది. దీనిలో స్టైలింగ్ పరంగా, ఫీచర్ల పరంగా, ఇంజిన్లోనూ భారీ మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కొత్త 2024 హీరో డెస్టినీ 125 స్కూటర్ ఈ సెప్టెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హీరో డెస్టినీ 125 ఎక్స్ టెక్ లుక్..

ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన విడుదల చేసిన టీజర్లో చాలా పెద్ద మార్పులే కనిపిస్తున్నాయి. పాత డెస్టినీకీ ఈ కొత్త డెస్టినీ ఎక్స్ టెక్ డిజైన్, స్టైలింగ్ పరంగా చాలా మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. ఈకొత్త 125సీసీ స్కూటర్లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీడిజైన్డ్ హెడ్ ల్యాంప్ తో మరింత రెట్రో లుక్ లో కనిపిస్తోంది. సిగ్నల్ ఇండికేటర్లు ముందు వైపు అప్రాన్ లో కలిసిపోయినట్లు ఉండటంతో స్లీక్ లుక్ ను అందిస్తున్నాయి. ముందు వైపు హెచ్ ఆకారంలో ప్యాటర్న్ ఆకట్టుకుంటోంది. మొత్తం మీద టీజర్ లో ఉన్న అంశాలను గమనిస్తే హీరో కంపెనీ స్టైలింగ్ పై పూర్తి ఫోకస్ పెట్టి మార్పులు చేసినట్లు అర్థమవుతోంది.

వెనుకవైపు కూడా హెచ్-ఆకారంలోనే ఎల్ఈడీ టైల్ లైటింగ్, ఇండికేటర్లు ఉన్నాయి. గ్రాబ్ రెయిల్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ బ్యాక్ రెస్ట్ ఉంటుంది. హ్యాండిల్ పక్కన ఉండే అద్దాలను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి హీరో జూమ్ 110 బండి మాదిరిగా ఉన్నాయి.

హీరో డెస్టినీ 125 ఎక్స్ టెక్ స్పెసిఫికేషన్స్..

హీరో కంపెనీ ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ చేయనప్పటికీ దీనిలో 124.6 సీసీ సింగిల్ సిలెండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోటార్ విషయంలో కూడా అప్ గ్రేడ్ ఉంటుందని చెబుతున్నారు. 7000ఆర్పీఎం వద్ద 9 బీహెచ్పీ , 5,500 ఆర్పీఎం వద్ద 10.4ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే సీవీటీ యూనిట్ ఉంటుంది.

మెకానికల్ భాగాల విషయానికి వస్తే ముందు వైపు టెలి స్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు సింగిల్ షాక్ అడ్జర్బర్ ఉంటుంది. ముందు వైపు డిస్క్ బ్రేకులు, వెనుకవైపు డ్రమ్ యూనిట్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

హీరో డెస్టినీ 125 ఎక్స్ టెక్ ధర అంచనా..

హీరో నుంచి వస్తున్న ఈ కొత్త స్కూటర్ ధర రూ. 85,000(ఎక్స్ షోరూం) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మోడల్ ధర రూ. 86,538(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న హోండా యాక్టివా 125, యమహా ఫ్యాసినో 125, సుజుకీ యాక్సెస్ 125, టీవీఎస్ జుపిటర్ 125 వాటి స్కూటర్లతో డైరెక్ట్ గా పోటీ పడనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..