Health Insurance: హెల్త్ పాలసీలు తీసుకునే వారికి షాక్.. ఇకపై ప్రీమియం మరింత భారం!
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరితే వైద్య ఖర్చులను ఉపయోగపడలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రజలకు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ షాక్ ఇచ్చింది. ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియాన్ని పది నుంచి పదిహేను శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది.
నేటి కాలంలో ప్రజలను అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. గతంలో 60 ఏళ్ల తర్వాత వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు 20 ఏళ్ల యువకులకు కూడా వస్తుండడం బాధాకరం. కాలుష్యం, పోషకాహార లోపం, తినే తిండిలో బలం లేకపోవడం, జంక్ ఫుడ్ తదితర అనేక కారణాలు వీటి వెనుక ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరితే వైద్య ఖర్చులను ఉపయోగపడలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రజలకు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ షాక్ ఇచ్చింది. ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియాన్ని పది నుంచి పదిహేను శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. దీని వెనుక గల కారణాలను తెలుసుకుందాం.
ప్రీమియాలు పెంచేందుకు కసరత్తు..
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే ఆరోగ్య బీమా ప్రీమియాలు 10 నుంచి 15 శాతం వరకూ పెరుగుతాయని ఆ సంస్థ ఎంపీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు. అధిక వైద్య ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ సంస్థ తన పాలసీలలో ఒక దాని ప్రీమియాన్ని పదిశాతం పెంచింది. మరో రెండు ప్లాన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే దృష్టి లోపంతో బాధపడే వారికోసం కొత్త పాలసీని విడుదల చేసింది. స్టార్ హెల్త్ సంస్థ సుమారు 35 రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందజేస్తోంది. వీటి అన్నింటి ప్రీమియం ధరలు పెరగకపోవచ్చు. కానీ కొన్ని పాలసీలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఐఆర్ డీఏఐ నిబంధనలు..
భారతీయ బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్ డీఏఐ) ఇటీవల బీమా పాలసీలకు సంబంధించి పలు మార్పులు చేసింది. వాటికి అనుసరించి 2024 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నేపత్యంలో బీమా కంపెనీలు కూడా తమ పాలసీ ప్రీమియాలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఐఆర్ డీఏ తీసుకువచ్చిన మాస్టర్ సర్క్యులర్ కస్టమర్లకు అనుకూలంగా ఉంది. దాన్ని బీమా కంపెనీలు కూడా స్వాగతించాయి. ఆ మేరకు సేవలు అందించడానికి ప్రీమియాలు పెంచుతున్నట్టు తెలుస్తోంది.
అంధుల కోసం కొత్త పాలసీ..
అంధుల కోసం కొత్తగా ఆరోగ్య బీమా పాలసీని స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ తీసుకువచ్చింది. ఈ పాలసీకి స్పెషల్ కేర్ గోల్డ్ అని పేరు పెట్టింది. అంధులు ఈ పాలసీ వివరాలను చదువుకునేందుకు వీలుగా బ్రెయిరీ లిపిలో అందిస్తోంది. ఇలా అంధుల కోసం బ్రెయిరీలిపిలో పాలసీ రావడం దేశంలో ఇదే ప్రథమం. నలభై శాతం, అంతకంటే ఎక్కువ అంధత్వం ఉన్న వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవచ్చు. మన దేశంలో దాదాపు మూడున్నరకోట్ల మంది అంధులు ఉన్నట్టు అంచనా. వారందరి ప్రయోజనం కోసం స్టార్ హెల్త్ కొత్త పాలసీని తీసుకువచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..