AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెటర్ల లైఫ్‌ స్టైల్‌ కావాలా? మీకు 25 ఏళ్లు ఉంటే ఇలా ఇన్వెస్ట్‌ చేయండి.. 40 ఏళ్లకే పనిచేయడం మానేయొచ్చు!

మీరు 40 ఏళ్లకే పదవీ విరమణ చేసి, రూ. 3 కోట్ల నిధిని సాధించాలనుకుంటున్నారా? 25 ఏళ్ల వయస్సు నుండి SIPలో నెలకు రూ. 15,396 పెట్టుబడి పెట్టడం ద్వారా ఇది సాధ్యం. చక్రవడ్డీ లాభాన్ని పొందడానికి ముందుగా పెట్టుబడి పెట్టడం కీలకం. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే SIPలు తక్కువ నష్టంతో మంచి రాబడిని అందిస్తాయి.

క్రికెటర్ల లైఫ్‌ స్టైల్‌ కావాలా? మీకు 25 ఏళ్లు ఉంటే ఇలా ఇన్వెస్ట్‌ చేయండి.. 40 ఏళ్లకే పనిచేయడం మానేయొచ్చు!
Indian Currency 7
SN Pasha
|

Updated on: Nov 28, 2025 | 8:00 AM

Share

మీరెప్పుడైనా గమనించారా? క్రికెటర్ల కెరీర్‌ ఎన్ని ఏళ్లు ఉంటుందో? మహా అయితే ఓ 10 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. సచిన్‌ లాంటి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర​ ఓ 20 ఏళ్ల క్రికెటర్‌ ఆడారు. ఆయన తన 17వ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 40 ఏళ్లు కూడా రాకముందే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి.. మిగతా లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. మీకు కూడా అలాంటి లైఫ్‌ సూపర్‌ కావాలంటే, 40 ఏళ్ల వయసులో రిటైర్‌ అయి మిగిలిన లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలంటే.. ఇప్పుడు జాబ్‌ చేస్తే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే మీ కల నిజం అవుతుంది.

పెట్టుబడి విషయానికి వస్తే ఒక సాధారణ పెట్టుబడిదారుడు ఎల్లప్పుడూ లాభాలను ఆర్జించే, నష్టాలను నిర్వహించే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తాడు. అటువంటి ఆకాంక్షలు ఉన్న పెట్టుబడిదారులకు SIP, పోస్ట్-ఆఫీస్ ప్రణాళికలు ఉత్తమంగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ నష్టాన్ని అందిస్తాయి. 25 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుబడి పెట్టడం ద్వారా 40 సంవత్సరాల వయస్సులో రూ.3 కోట్ల నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.

పెద్ద నిధి కోసం చూస్తున్న పెట్టుబడిదారులు ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం ఎల్లప్పుడూ ప్రయోజనకరం. ఎందుకంటే అప్పుడే చక్రవడ్డీ నిజమైన ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. నిపుణులు తరచుగా చెప్పినట్లుగా పెట్టుబడి పెట్టడంలో అతి ముఖ్యమైన దశ ప్రారంభించడం, రెండవ దశ మీ డబ్బు పెరగడానికి తగినంత సమయం ఇవ్వడం. మీరు స్థిరంగా పెట్టుబడి పెడితే ఒక చిన్న నెలవారీ SIP కూడా ముఖ్యమైన పదవీ విరమణ నిధిగా మారుతుంది. మీరు SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టి వార్షికంగా 12 శాతం రాబడిని ఆర్జిస్తే, పదవీ విరమణ ద్వారా రూ.3 కోట్ల నిధిని సొంతం చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు 25 సంవత్సరాల వయస్సు ఉంటే.. నెలకు SIP కేవలం రూ.15,396తో స్టార్ట్‌ చేయండి. 40 ఏళ్లు వచ్చేసరిక రిటైర్మెంట్‌ కూడా తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us