Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: మరోసారి దుమ్మురేపిన రిలయన్స్‌ జియో.. డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్‌లో నంబర్‌వన్

5G సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అక్టోబర్ నెలలో 4G స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం సెప్టెంబరులో జియో 4జీ డౌన్‌లోడ్ సగటు వేగం 19.1 ఎంబీపీఎస్ కాగా, అక్టోబరులో అది 20.3 ఎంబీపీఎస్‌కు పెరిగింది.

Reliance Jio: మరోసారి దుమ్మురేపిన రిలయన్స్‌ జియో.. డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్‌లో నంబర్‌వన్
Reliance Jio
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2022 | 7:00 AM

అగ్రగామి టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మరోమారు సత్తా చాటింది. 4జీ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 5G సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అక్టోబర్ నెలలో 4G స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం సెప్టెంబరులో జియో 4జీ డౌన్‌లోడ్ సగటు వేగం 19.1 ఎంబీపీఎస్ కాగా, అక్టోబరులో అది 20.3 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అదే సమయంలో అక్టోబరులో భారతీ ఎయిర్‌టెల్ 4జీ డౌన్‌లోడ్ వేగం 15 ఎంబీపీఎస్ కాగా, వీఐ (వొడాఫోన్‌-ఐడియా) 14.5 ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ రెండింటితో పోలిస్తే జియో సగటు డౌన్‌లోడ్ వేగం 5 ఎంబీపీఎస్ ఎక్కువ. ఇక సగటు 4G అప్‌లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. 6.2 ఎంబీపీఎస్ సగటు 4G అప్‌లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. Vi (వోడాఫోన్-ఐడియా) 4.5 ఎంబీపీఎస్‌ వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్‌టెల్ పరిస్థితి దారుణంగా ఉంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4G అప్‌లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7ఎంబీపీఎస్ కి చేరుకుంది. ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది.

కాగా జియో ట్రూ 5జీ సేవలు గత నెలలో ప్రారంభమయ్యాయి. మొదట ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలో జియో 5జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆతర్వాత హైదరాబాద్ , బెంగళూరు నగరాల్లో కూడా జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నథ్‌ద్వారా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా 500ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో జియో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో జియో 5జీ సేవలను వాడుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా జియో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?