Reliance Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన..100GBలు ఉచితం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వినియోగదారుల కోసం కీలక ప్రకటనలు చేస్తుంటారు. టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతుంది. ఇతర సంస్థలకు పోటీగా తన బిజినెస్‌ను మరింతగా విస్తరించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది దీపావళికి జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లులో అంబానీ ప్రకటించారు. ఈ ఆఫర్‌లో భాగంగా, రిలయన్స్ జియో తన వినియోగదారులకు..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వినియోగదారుల కోసం కీలక ప్రకటనలు చేస్తుంటారు. టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతుంది. ఇతర సంస్థలకు పోటీగా తన బిజినెస్‌ను మరింతగా విస్తరించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది దీపావళికి జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లులో అంబానీ ప్రకటించారు. ఈ ఆఫర్‌లో భాగంగా, రిలయన్స్ జియో తన వినియోగదారులకు 100జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏఐ ఆధారిత క్లౌడ్ స్టోరేజీలో జియో యూజర్లు తమ ఫొటో లు, వీడియోలు, డాక్యుమెంట్లతోపాటు ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుదని అన్నారు. అవసరమైన వారికి అదనపు స్టోరేజిని అత్యంత అందుబాటు ధరలో అందించనున్నట్లు అంబానీ స్పష్టం చేశారు. ఈ సర్వీస్ ద్వారా గూగుల్, యాపిల్‌కు జియో గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జియో అందించనున్న మరిన్ని ఏఐ సేవల వివరాలు..
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణకు రెడ్ అలర్ట్.. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనుందా?
గురువారం జరిగిన రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. వెల్‌కమ్ ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నామని అన్నారు. ఇక అధిక స్టోరేజీ కావాలనే వినియోగదారుల కోసం అందుబాటు ధరల్లో అందించనున్నట్లు చెప్పారు.
కొత్త JioTV+
వినియోగదారుల కోసం వినోదం కోసం లైవ్ టీవీ, ఆన్-డిమాండ్ షోల కోసం అంబానీ జియో టీవీ ఓఎస్, జియో హోమ్, జియో టీవీ+లను ప్రకటించారు. దీని కింద వినియోగదారులు 860 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాకుండా జియో టీవీ+తో వినియోగదారులు Amazon Prime Video, Disney Plus, Hotstar వంటి యాప్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు.
ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్ నుంచి మారనున్న కీలక మార్పులు ఇవే.. కొత్త నిబంధనలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి