Mukesh Ambani: హోమ్‌ లోన్‌ ఇవ్వనున్న అంబానీ.. అసలు ప్లాన్‌ ఏంటో తెలుసా?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ దేశ ప్రజలకు గృహాలను నిర్మించుకోవడానికి సహాయం చేయనున్నారు. ఆయన రుణాలు ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే.. అంబానీ ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో సామాన్యులకు గృహ రుణాలను అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం సంస్థ తరపున పనులు..

Mukesh Ambani: హోమ్‌ లోన్‌ ఇవ్వనున్న అంబానీ.. అసలు ప్లాన్‌ ఏంటో తెలుసా?
Mukesh Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Aug 31, 2024 | 4:12 PM

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ దేశ ప్రజలకు గృహాలను నిర్మించుకోవడానికి సహాయం చేయనున్నారు. ఆయన రుణాలు ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే.. అంబానీ ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో సామాన్యులకు గృహ రుణాలను అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం సంస్థ తరపున పనులు కూడా ప్రారంభించారు.

ముఖేష్ అంబానీ తన ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ జియో ఫైనాన్షియల్‌ను గత ఏడాది మాత్రమే ప్రారంభించారు. శుక్రవారం జియో ఫైనాన్షియల్ కంపెనీ షేర్లు 1 శాతం కంటే ఎక్కువ పతనంతో ముగిశాయి. ముఖేష్ అంబానీ కంపెనీ ఎలాంటి ప్లాన్ చేయనుందో తెలుసుకుందాం.

కంపెనీ సమాచారం ప్రకారం.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, గృహ రుణ సేవను ప్రారంభించే చివరి దశలో ఉందని తెలిపింది. ఇది టెస్టింగ్ (బీటా)గా ప్రారంభించింది. ఇది కాకుండా, కంపెనీ ఆస్తిపై రుణం, సెక్యూరిటీలపై రుణం వంటి ఇతర ఉత్పత్తులను కూడా పరిచయం చేయబోతోంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: సెప్టెంబర్‌లో 14 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో తెలుసా?

శుక్రవారం జరిగిన మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో (పోస్ట్-లిస్టింగ్) వాటాదారులను ఉద్దేశించి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) హితేష్ సేథియా మాట్లాడుతూ, తాము గృహ రుణాలను ప్రారంభించే చివరి దశలో ఉన్నామని అన్నారు. దీనిపై పూర్తి కసరత్తు జరుగుతుందన్నారు.

ఆస్తిపై రుణం, సెక్యూరిటీలపై రుణం వంటి ఇతర ఉత్పత్తులు కూడా లైన్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇప్పటికే సప్లై చైన్ ఫైనాన్సింగ్, మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ కోసం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ వంటి సురక్షిత రుణ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Ambani House: అంబానీ ఇంటి నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది? ఖర్చు ఎంత? ఇంటి ప్రత్యేకతలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి