AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani House: అంబానీ ఇంటి నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది? ఖర్చు ఎంత? ఇంటి ప్రత్యేకతలు ఏంటి?

ముఖేష్‌ అంబానీ..ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్నారు. అంబానీ ఇంటిపేరు యాంటిలియా. ఇది ముంబైలో ఉంది. 27 అంతస్తుల ఈ భవనంలో ముఖేష్‌ అంబానీ కుటుంబం మాత్రమే నివరిస్తోంది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాల 15వేల కోట్ల రూపాయలు. ఇందులో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. అంటే 173 మీటర్లు (568 అడుగులు) ఎత్తు. మొత్తం ఇంటిని 37,000 చదరపు మీటర్ల..

Ambani House: అంబానీ ఇంటి నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది? ఖర్చు ఎంత? ఇంటి ప్రత్యేకతలు ఏంటి?
Ambani House Antilia
Subhash Goud
|

Updated on: Aug 30, 2024 | 7:16 PM

Share

ముఖేష్‌ అంబానీ..ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్నారు. అంబానీ ఇంటిపేరు యాంటిలియా. ఇది ముంబైలో ఉంది. 27 అంతస్తుల ఈ భవనంలో ముఖేష్‌ అంబానీ కుటుంబం మాత్రమే నివరిస్తోంది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాల 15వేల కోట్ల రూపాయలు. ఇందులో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. అంటే 173 మీటర్లు (568 అడుగులు) ఎత్తు. మొత్తం ఇంటిని 37,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. యాంటిలియాలో 168 కార్ల గ్యారేజ్, 9 హై స్పీడ్ లిఫ్టులు, 50 సీట్ల థియేటర్, టెర్రస్డ్ గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్, స్పా, హెల్త్ సెంటర్ ఇంకా టెంపుల్ ఎన్నో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Nonstick Cookwares: నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా?

యాంటిలియా నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది?

యాంటిలియాను అమెరికన్ సంస్థ పెర్కిన్స్ అండ్‌ విల్ ఇంకా లాస్ ఏంజిల్స్‌కు చెందిన నిర్మాణ సంస్థ హిర్ష్ బెట్నర్ అసోసియేట్స్ చేపట్టింది. ఈ ఇంటి నిర్మాణం 2006లో ప్రారంభమై 2010లో పూర్తయ్యింది.

హై -క్వాలిటీ పెయింటింగ్‌

ఇదిలా ఉంటే ముఖేష్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు తమ ఇంటి అతిథులను కోసం ప్రత్యేక గదులను నిర్మించారు. ఇంటి హల్‌లో ప్రత్యేక సోఫాలు, ఇంకా హై -క్వాలిటీ పెయింటింగ్‌తో ఉంటుంది. ఇక్కడి సోఫాలు, ఇంటి పెయింటింగ్స్‌ అతిథులను ఆకర్షిస్తుంది.

Ambani House

Ambani House

ఈ ఇంటిని చేపట్టిన సంస్థ పెర్కిన్స్ అండ్‌ విల్ చికాగోలో ఉంది. ఈ కంపెనీ సీఈవో బిల్ హారిసన్ అనే బ్రిటీష్ వ్యాపారవేత్త. బిల్ హారిసన్ మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అలాగే జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. బిల్ హారిసన్ 1989 నుండి 1992 వరకు మైండ్‌స్కేప్ ఇంటర్నేషనల్‌లో డెవలప్‌మెంట్ హెడ్‌గా కూడా పని చేశారట. బిల్ హారిసన్ 9 యూఎస్‌ రాష్ట్రాలు, 2 కెనడియన్ భూభాగాలలో లైసెన్స్ పొందిన ఆర్కిటెక్ట్. బిల్ హారిసన్ తన కుటుంబంతో కలిసి అట్లాంటాలో నివసిస్తున్నాడు. అంబానీ కుటుంబం 2012లో యాంటిలియాకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.15,000 కోట్లు. యాంటిలియా ఇంటి డిజైన్, ఇంటీరియర్, గ్రాండ్ పార్టీలు, నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లో తరచుగా వార్తల్లో ఉంటుంది.

ఈ ఇంటిలో ఎంత మంది పని చేస్తారు?

27 అంతస్తుల యాంటిలియా లగ్జరీ ఇంటిలో మొత్తం 600 మంది పనిచేస్తున్నారు. వీళ్లు మామూలు వ్యక్తులు కాదు. ఉన్నత విద్యావంతులు. చెత్త ఊడ్చడానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి చాలా మందిని విడివిడిగా నియమిస్తారు. అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలంటే అదృష్టం ఉండాలంటారు. ఎందుకంటే ఇక్కడ పని చేసేవారి జీతాలు మామూలుగా ఉండవు. లక్షల్లోనే ఉంటాయి. ఇక్కడ పని మనిషిగా చేయాలన్నా అన్ని అర్హతలు చేసే తీసుకుంటారు. అంతేకాదు ఇక్కడ పని చేసేవారికి అధిక మొత్తంలో జీతాలే కాకుండా వారికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌లతో పాటు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయట. యాంటిలియాలో పని చేసే ప్రతి ఒక్కరు కూడా శిక్షన పొంది ఉంటారు. పని చేసేవారికి ప్రత్యేక క్వార్టర్స్‌ కూడా నిర్మించారు.

ఇది కూడా చదవండి: TRAI: మొబైల్‌ యూజర్లకు పెద్ద సమస్య.. ఓటీపీలు ఆగిపోనున్నాయా? సెప్టెంబర్‌ నుంచి కొత్త రూల్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి