PF Pension: మీకు పీఎఫ్ ఖాతా ఉందా? ఈ 6 రకాల పెన్షన్ల గురించి మీకు తెలుసా?
సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించేందుకు.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పని చేస్తుంది. అయితే ఉద్యోగులు జీతంలో 12 శాతం కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. ఉద్యోగి నుంచి ఎంత మొత్తం కట్ చేస్తారో.. కంపెనీ కూడా అంతే మొత్తంలో యాడ్ చేసి జమ చేస్తుంది. అంతేకాదు దీనిపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేస్తుంది. ఈ మొత్తం అంతా కూడా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది..
సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించేందుకు.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పని చేస్తుంది. అయితే ఉద్యోగులు జీతంలో 12 శాతం కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. ఉద్యోగి నుంచి ఎంత మొత్తం కట్ చేస్తారో.. కంపెనీ కూడా అంతే మొత్తంలో యాడ్ చేసి జమ చేస్తుంది. అంతేకాదు దీనిపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేస్తుంది. ఈ మొత్తం అంతా కూడా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ పీఎఫ్‌ను ఉద్యోగి ఆరోగ్య, వివాహ, ఇంటి నిర్మాణం వంటి పనుల కోసం డబ్బులను మధ్యలో ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జమ అయిన డబ్బును రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో పొందుతారు. అయితే ఈపీఎఫ్ఓ మొత్తం 6 రకాల పెన్షన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Nonstick Cookwares: నాన్‌స్టిక్ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా?
EPS 95 కింద ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందజేస్తుంది. ఈ పెన్షన్లకు ఎలాంటి వారు అర్హులో చూద్దాం. పెన్షన్ పొందాలంటే తప్పకుండా ఈపీఎఫ్ఓ సభ్యులై ఉండాలి. వారు 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలని గుర్తించుకోండి. అలాగే 58 సంవత్సరాల వయసు దాటాలి. ముందస్తు పెన్షన్ పొందేందుకు 50 ఏళ్ల వయసు నిండి ఉండాలి. 60 ఏళ్ల వరకు వాయిదా వేసుకుంటే అదనంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
- సూపర్ యాన్యుయేషన్ పెన్షన్– 10 సంవత్సరాలు ఉద్యోగ సర్వీస్ పూర్తి చేసిన వారు లేదా 58 సంవత్సరాలు నిండిపోయి.. రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు ఈ పెన్షన్ వస్తుంది.
- డిసేబుల్డ్ పెన్షన్- తమ సర్వీసు కాలంలో తాత్కాలిక లేక శాశ్వత అంగవైకల్యం బారిన పడిన ఈపీఎఫ్ చందాదారులు.. ఈ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటంఉది. ఇందు కోసం వయసు 50 లేదా 58 నిండి ఉండాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి. కనీసం ఒక నెల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించినా ఈ పెన్షన్ వస్తుంది.
- పిల్లల లేదా వితంతు పెన్షన్- పీఎఫ్ సబ్‌స్క్రైబర్ మరణిస్తే.. అతని భార్య లేదా భర్త, 25 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఈ పెన్షన్ పొందవచ్చు. ఇక మృతుల మొదటి సంతానం వయసు 25 ఏళ్లు దాటి మూడో బిడ్డ ఉంటే.. అప్పుడు అతను కూడా పెన్షన్ అందుకోవచ్చు. ఇక్కడ కూడా పదేళ్ల సర్వీసు ఉండాలన్న రూల్ లేదు.
- ముందస్తు పెన్షన్- 50 ఏళ్లు పైబడినవారు, పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు ఈ ముందస్తు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. ముందస్తు పెన్షన్ ఎంచుకుంటే.. ఏటా 4 శాతం తక్కువ పెన్షన్ అందుకుంటారు. ఉదాహరణకు చూస్తే.. 58 ఏళ్లు నిండిన వారికి రూ. 10 వేల చొప్పున పెన్షన్ వస్తుందనుకుంటే.. 57 ఏళ్లు ఉన్న వారికి ఇది రూ. 9600 గా ఉంటుంది. ఇలా సంవత్సరం తగ్గుతున్న కొద్దీ పెన్షన్ తగ్గుకుంటూ వస్తుంది.
- అనాథ పెన్షన్- పీఎఫ్ ఖాతా ఉన్న వ్యక్తి .. వారి జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినట్లయితే.. వారి ఇద్దరు పిల్లలకు పెన్షన్ లభిస్తుంది. దీనిని ఆర్ఫాన్ పెన్షన్ అంటారు. వయసు మాత్రం 25 ఏళ్ల లోపు ఉండాలి. అయితే 25 ఏళ్లు దాటితే వారికి పెన్షన్ మొత్తం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- నామినీ పెన్షన్- పీఎఫ్ ఖాతాదారు మరణించిన తర్వాత.. అతడి నామినీ ఈ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్లో ముందుగా ఇ- నామినీ పేర్కొనాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి