AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Challan: ఇక తప్పించుకోలేరు.. మీ ఫోన్‌కే రానున్న ట్రాఫిక్ చలాన్లు..

మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడతారో వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది.

Traffic Challan: ఇక తప్పించుకోలేరు.. మీ ఫోన్‌కే రానున్న ట్రాఫిక్ చలాన్లు..
Traffic Challan
Madhu
|

Updated on: Aug 30, 2024 | 6:26 PM

Share

ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుటైనా ట్రాఫిక్ పోలీసులు మన బండిని ఆపినప్పుడే కదా అవి మనకు గుర్తొచ్చేవి. చాలా మందికి అసలు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నట్లు కూడా తెలీదు. ఎప్పుడో ఏదో ఒక సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమో, సిటీ లిమిట్స్ లో ఓవర్ స్పీడ్లో వెళ్లడమో, పోలీసుల తనిఖీలకు సహకరించకపోవడమో, హెల్మెట్ లేకుండా టూవీలర్ నడపడం వంటి వాటి వల్ల మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఫైన్ చెల్లించకుండానే చాలా మంది ఏళ్లు గడిపేస్తూ ఉంటారు. అయితే ఇకపై ఆ విధంగా కాలం గడిపేయడం కుదరకపోవచ్చు. మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడతారో వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్‌లకు వచ్చే టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ కి ఆటోమేటిక్‌గా ఈ ట్రాఫిక్ చలాన్ వచ్చేస్తుంది. ఇది ఉల్లంఘనతో దాని కోసం విధించిన జరిమానా గురించి కూడా తెలియజేస్తుంది. ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తోంది.

ఆన్ లైన్ పేమెంట్లు..

రవాణా శాఖ చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేసింది. అందుకోసం నిబంధనలు ఉల్లంఘించిన వారు ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చింది. ట్రాఫిక్ చలాన్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశం ద్వారా పంపిస్తారు. ఇది ఆన్‌లైన్ చెల్లింపు కోసం లింక్‌ను కలిగి ఉంటుంది. లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో ఏదో ఒక గేట్ వే ద్వారా లావాదేవీని పూర్తి చేయొచ్చు.

నోటిఫికేషన్..

యూపీఐ యాప్ ద్వారా చలాన్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఒకవేళ కొత్త చలాన్ రూపొందితే ప్రతిసారీ పుష్ నోటిఫికేషన్ మీ ఫోన్‌కి వస్తుంది. ఆ తర్వాత అవి చర్య తీసుకునే ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది. చాలా మంది ప్రజలు ఆన్‌లైన్‌లో జరిమానాలు చెల్లించడాన్ని విస్మరించడం లేదా తమ వద్ద జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలియకపోవటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ కొత్త వ్యవస్థతో ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. ప్రస్తుతం వాహన యజమానులు జరిమానాలు చెల్లించేందుకు రవాణా శాఖ ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో, చాలా మంది పెండింగ్‌లో ఉన్న జరిమానాలు లేదా చలాన్‌ల కోసం ఎటువంటి ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌ను స్వీకరించరు. అయితే, కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ సమస్య పరిష్కారమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..