AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: మొబైల్‌ యూజర్లకు పెద్ద సమస్య.. ఓటీపీలు ఆగిపోనున్నాయా? సెప్టెంబర్‌ నుంచి కొత్త రూల్‌

స్పామ్‌ కాల్స్‌పై కేంద్ర సర్కార్‌ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ తీసుకొస్తున్న కొత్త నిబంధనతో వినియోగదారులు ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే TRAI కొత్త రూల్ ప్రకారం నకిలీ కాల్‌లు, సందేశాలను అరికట్టనున్నారు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది అమలు చేసిన తర్వాత అవాంఛిత కాల్‌ల సమస్య చాలా వరకు..

TRAI: మొబైల్‌ యూజర్లకు పెద్ద సమస్య.. ఓటీపీలు ఆగిపోనున్నాయా? సెప్టెంబర్‌ నుంచి కొత్త రూల్‌
Trai
Subhash Goud
|

Updated on: Aug 30, 2024 | 4:46 PM

Share

స్పామ్‌ కాల్స్‌పై కేంద్ర సర్కార్‌ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ తీసుకొస్తున్న కొత్త నిబంధనతో వినియోగదారులు ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే TRAI కొత్త రూల్ ప్రకారం నకిలీ కాల్‌లు, సందేశాలను అరికట్టనున్నారు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది అమలు చేసిన తర్వాత అవాంఛిత కాల్‌ల సమస్య చాలా వరకు తొలగిపోతుంది. కానీ నకిలీ సందేశాలు, కాల్‌లను ఫిల్టర్ చేయడంలో, బ్యాంకింగ్ సందేశాలు, ఓటీపీలను పొందడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

తమ బ్యాంక్ ఓటీపీ, డెలివరీ ఓటీపీలు విఫలమయ్యే అవకాశం ఉన్న భారతదేశంలోని మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి సమస్య తతెత్తవచ్చు. అయితే ఒక వేళ ఓటీపీలు ఆగిపోతే మీరు చెల్లింపులకు అధికారం ఇవ్వలేరు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేసిన తర్వాత డెలివరీ సమయంలో మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే మీకు డెలివరీ బాయ్‌ మీ ప్రొడక్ట్‌ను అందజేస్తారు. దీంతో ఈ ఓటీపీలు కూడా రాని పరిస్థితి ఉంటే ఆన్‌లైన్ డెలివరీని తీసుకోలేరు.

సెప్టెంబర్‌ 1 నుంచి నమోదు చేసుకోని URLలు, OTT లింక్‌లు, APKలు (Android అప్లికేషన్ ప్యాకేజీలు) లేదా కాల్ బ్యాక్ నంబర్‌లను కలిగి ఉన్న సందేశాలను బ్లాక్ చేయాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ సందేశాలు, ఓటీపీ టెంప్లేట్‌లు, కంటెంట్‌ని జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్‌లతో ఆగస్టు 31 లోపు నమోదు చేసుకోవాలి. ఇది చేయకపోతే అటువంటి సందేశాలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మాల్వేర్ బెదిరింపులను కలిగి ఉన్న SMS లేదా Android యాప్ APK ఫైల్‌లను బ్లాక్ చేయాలని TRAI నిర్ణయించింది. ఈ లింక్ లేదా మెసేజ్‌పై క్లిక్ చేయడం ద్వారా, హ్యాకర్లు మొబైల్ నుండి మొత్తం సమాచారాన్ని, డబ్బును లాక్కుంటారు. ఇలాంటి మోసాలు జరగకుండా ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు, వారి పేరు నమోదు చేయకపోతే, వారు పంపిన సందేశం లేదా OTP కస్టమర్ ఫోన్‌కు చేరదు.

స్పామ్‌ను ఎలా నిరోధించాలి?

టెలికాం కంపెనీలు కొత్త మెసేజ్ టెంప్లేట్‌ను సృష్టిస్తాయి. వైట్‌లిస్ట్ చేయకుంటే, ఈ సందేశాలు బ్లాక్ చేయబడతాయి. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్ల నుండి Zomato, Uber వంటి యాప్‌ల వరకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి