Tata Motors: టాటా ఈవీలకు ‘చైనా’ బూస్ట్! బ్యాటరీల సామర్థ్యం పెంచేందుకు కీలక అడుగులు..

ఆక్టిలియన్ పవర్ సిస్టమ్స్‌ అనేది చైనాలోని బ్యాటరీ ప్యాక్ తయారీ సంస్థ. దీని నుంచి తన ఈవీలకు బ్యాటరీలు కొనుగోలు చేయాలని టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ తన గ్రూప్ కంపెనీ అయిన టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ లిమిటెడ్ నుంచి బ్యాటరీ ప్యాక్ లను కొనుగోలు చేసేది. ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుని చైనా సంస్థతో కలిసింది.

Tata Motors: టాటా ఈవీలకు ‘చైనా’ బూస్ట్! బ్యాటరీల సామర్థ్యం పెంచేందుకు కీలక అడుగులు..
Electric Car Charging
Follow us

|

Updated on: Aug 30, 2024 | 7:19 PM

ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ నుంచి విడులయ్యే వాహనాలకు దేశంలో ఎంతో ఆదరణ ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ, అత్యుత్తమ ఫీచర్లతో విడుదలయ్యే ఈ కంపెనీ కార్ల కోసం వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించి అనేక వాహనాలను విడుదల చేసింది. అయితే కొత్తగా ఈవీల బ్యాటరీ పనితీరును మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా చైనాకు చెందిన బ్యాటరీ సరఫరా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

వ్యూహాత్మక కారణాలు..

టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అనేక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈవీల మార్కెట్ లో విపరీతమైన పోటీ నెలకొంది. పోటీని తట్టుకునేందుకు కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టాటా ఈవీల అమ్మకాలు కూడా తగ్గిపోవడం దీనికి వెనుక ప్రధాన కారణం. ఆక్టిలియన్ పవర్ సిస్టమ్స్‌ అనేది చైనాలోని బ్యాటరీ ప్యాక్ తయారీ సంస్థ. దీని నుంచి తన ఈవీలకు బ్యాటరీలు కొనుగోలు చేయాలని టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ తన గ్రూప్ కంపెనీ అయిన టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ లిమిటెడ్ నుంచి బ్యాటరీ ప్యాక్ లను కొనుగోలు చేసేది. ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుని చైనా సంస్థతో కలిసింది. టాటా కంపెనీకి చెందిన తాజా కర్వ్ కూపే ఎస్ యూవీ లో ఆక్టిలియన్ సంస్థ తయారు చేసిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఆ సంస్థకు కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే అమెరికాతో పాటు మన దేశంలో పనిచేస్తోంది.

సవాళ్లను ఎదుర్కొనేందుకు..

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు టాటా మోటార్స్ తాజా నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కంపెనీకి చెందిన మునుపటి మోడళ్లలో బ్యాటరీ చార్జింగ్ తగ్గుదల వంటి సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించడంలో భాగంగా చైనా బ్యాటరీ సంస్థతో ఒప్పదం కుదుర్చుకుంది. కొత్త బ్యాటరీ ప్యాక్ డిజైన్లు, విభిన్న సెల్ రకాలను చేర్చడం ద్వారా టాటా మోటార్స్ తన ఈవీలకు ప్రజల విశ్వసనీయతను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ అనేక కొత్త ఈవీ మోడళ్లను పరిచయం చేయనున్నందున, వాటి సాంకేతిక సామర్జ్యాలను మెరుగపర్చడానికి ఆక్టిలియన్ సంస్థతో కలిసి ముందుకు సాగనుంది.

ఆక్టిలియన్ సంస్థ..

చైనాకు చెందిన ఆక్టిలియన్ సంస్థ గతేడాది మన దేశంలోని పూణెలో 2జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ అందించిన బ్యాటర్ ప్యాక్ లను టాటా కర్వ్ ఈవీ 45కేడబ్ల్యూహెచ్ వేరియంట్ లో వినియోగించారు. అలాగే మరో చైనీస్ కంపెనీ ఈవీఈ అందించిన 15.2ఏహెచ్ సిలిండ్రికల్ సెల్స్ ను కూడా వాడారు.

ఇదే తొలిసారి..

టాటా కర్వ్ ఈవీ 55కేడబ్ల్యూహెచ్ వేరియంట్ లో టాటా ఆటోకాంప్ నుంచి విడుదలైన బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించడం కొనసాగుతుంది. వీటిలో చైనీస్ లిథియం-అయాన్ సెల్ ప్రొవైడర్ అయిన గోషన్ నుంచి విడుదలైన 105ఏహెచ్ ప్రిస్మాటిక్ సెల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు టాటా మోటార్స్ తన ప్యాసింజర్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌లను టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్ ద్వారా గోషన్ నుంచి సెల్‌లను ఉపయోగించి తయారు చేసింది. టాటా మోటార్స్ తన స్టార్‌బస్ ఈవీ కోసం ఆక్టిలియన్ బ్యాటరీ ప్యాక్‌లను రెండేళ్లుగా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయాణీకుల ఈవీలో ఉపయోగించడం ఇదే మొదటిసారి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!