AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Tickets: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న విమానం టికెట్లు.. ధరలు పెరిగినా తగ్గని బుకింగ్స్..

ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా, 31వ తేదీన దీపావళి రానున్నాయి. పండుగల కోసం అనేక విమానయాన సంస్థలు ప్రత్యేక డీల్‌లను అందించాయి. కానీ ఈసారి టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రూట్లలో చార్జీలు రూ.20 వేల నుంచి రూ 30 వేల వరకూ ఉన్నాయి. ముందస్తు బుకింగ్‌లు ఉన్నప్పటికీ ధరల పెరుగుదల ఏమాత్రం తగ్గలేదు.

Air Tickets: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న విమానం టికెట్లు.. ధరలు పెరిగినా తగ్గని బుకింగ్స్..
Indigo Airlines
Madhu
|

Updated on: Aug 30, 2024 | 7:45 PM

Share

పండుగల సీజన్ త్వరలో వస్తోంది. ఉద్యోగం, వ్యాపారం కోసం బయట ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ తమ సొంతూళ్లకు తిరిగి వస్తారు. తమ తల్లిదండ్రులు, స్నేహితుల కలసి పండగలను ఆనందంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో విమానాల టిక్కెట్ల బుక్కింగ్ ఊపందుకుంది. ముఖ్యంగా దసరా, దీపావళి పండగల కోసం చాలామంది విమాన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఇది గతేడాదిలో పోల్చితే దాదాపు 20 శాతం ఎక్కువ. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫాం ఇక్సిగో తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఇదే నెలలతో పోలిస్తే దీపావళి, దసరా పండగ ముందస్తు విమాన బుక్కింగ్ 30 నుంచి 35 శాతం పెరిగింది.

పెరిగిన ధరలు..

ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా, 31వ తేదీన దీపావళి రానున్నాయి. పండుగల కోసం అనేక విమానయాన సంస్థలు ప్రత్యేక డీల్‌లను అందించాయి. కానీ ఈసారి టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రూట్లలో చార్జీలు రూ.20 వేల నుంచి రూ 30 వేల వరకూ ఉన్నాయి. ముందస్తు బుకింగ్‌లు ఉన్నప్పటికీ ధరల పెరుగుదల ఏమాత్రం తగ్గలేదు.

విస్తారా తన ఫ్రీడమ్ సేల్‌ను ఆగస్టు 15న ప్రారంభించింది, వన్-వే దేశీయ ఛార్జీని ఎకానమీకి రూ. 1,578, ప్రీమియం ఎకానమీకి రూ. 2,678, బిజినెస్ క్లాస్‌కు రూ. 9,978గా నిర్ణయించింది. అక్టోబర్ 31 వరకూ ప్రయాణించే వీలుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రూ. 1,037 నుంచి ప్రారంభమయ్యే ఛార్జీలతో ఫ్లాష్ సేల్ ను ప్రారంభించింది. ఆగస్టు 26 నుండి అక్టోబర్ 24 వరకూ చేసే దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఆగస్టు 25 లోపు జరిగిన బుకింగ్‌లకు ఎటువంటి కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయడం లేదు.

విమానాయాన సంస్థలకు పండగే..

విమానాయాన సంస్థలకు ఇది ఒక రకంగా పండగ అని చెప్పవచ్చు. పెరిగిన బుక్కింగ్ లతో విమనాలు కళకళలాడనున్నాయి. మూడు నెలల కంటే ముందుగానే బుక్ చేసుకునే వారికి కూడా టికెట్ల ధరలు తగ్గలేదు. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. వన్ వే టికెట్ల ధరలను పరిశీలిస్తే ముంబై నుంచి పాట్నాకు రూ. 20 వేలు దాటింది. బెంగళూరు నుంచి వారణాసికి రూ. 24 వేలు, బెంగళూరు నుంచి పాట్నాకు రూ. 30 వేల వరకూ ఉన్నాయి. లక్నో, ఢిల్లీ నుంచి గౌహతితో సహా ఇతర కీలక మార్గాల్లో కూడా టికెట్ల ధరలలో పెరుగుదల నెలకొంది. ఇవి రూ.14 వేల నుంచి 18వేల మధ్యలో ఉన్నాయి.

ముందస్తుగా బుక్ చేసినా..

సాధారణంగా ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకుంటే ధరలు చాలా తక్కువగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ ఈ సారి ఆ అంచనా తప్పింది. ముందస్తుగా బుక్కింగ్ చేసుకున్న వారికి టికెట్ల ధర ఎక్కువగా ఉంది. ఇక పండగల సమయంలో ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

స్పందించిన ప్రభుత్వం..

విమానం టికెట్ల ధర పెరుగుదల వల్ల ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించింది. గతేడాది కంటే 20 శాతానికి మించి ధరలు పెంచిన దేశీల రూట్లలో విమానాల ఫ్రీక్వెన్సీని పెంచేందుకు ప్రయత్నించాలని విమానయాన సంస్థలను కోరింది.

ఉపశమనం..

విమానాయాన సంస్థలు తమ విమానాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నందున చార్జీల ధరల విషయంలో కొంత తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియ ఎక్స్ ప్రెస్ వంటి సంస్థలకు నవంబర్ లోపు అదనపు విమానాాలు రానున్నాయి. ఇవన్నీ దేశీయ మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. విమానాల సంఖ్య పెరిగితే టిక్కెట్ల ధర అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..