AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐలో భారీగా పెరిగిన పసిడి నిల్వలు.. కారణం ఇదే!

ఇటీవల కాలంలో భారత్ లో పసిడి ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. విదేశాల్లో నిల్వ చేసిన బంగారాన్నిరహస్యంగా ఇండియాకు తీసుకువచ్చింది..

RBI: ఆర్బీఐలో భారీగా పెరిగిన పసిడి నిల్వలు.. కారణం ఇదే!
Reserve Bank Of India
Srilakshmi C
|

Updated on: Oct 30, 2024 | 2:03 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ మొత్తంలో బంగారాన్ని స్వదేశానికి తీసుకువచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌ల నుంచి దాదాపు 102 టన్నుల బంగారాన్ని తీసుకువచ్చింది. దీంతో ఆర్బీఐలో బంగారం నిల్వలు పెరిగాయి. 2024 సెప్టెంబర్ చివరి నాటికి RBI మొత్తం నిల్వలలో 855 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. 2024 మార్చి 31న ఇవి 408 మెట్రిక్‌ టన్నులుగా ఉన్నాయి. విదేశాల్లో ఉంచిన నిల్వలతో కలిపి 854.73 టన్నులుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. గత కొంతకాలంగా ఆర్బీఐలోని గోల్డ్‌ నిల్వలను దేశంలోని స్థానిక వాల్ట్‌లకు తరలిస్తున్నారు.

1991 తర్వాత మొదటిసారిగా UK నుంచి భారతదేశంలోని దాని వాల్ట్‌లకు 100 టన్నులకు పైగా బంగారాన్ని తరలించింది. ఇంకా 324.01 మెట్రిక్‌ టన్నుల గోల్డ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ సేఫ్‌ కస్టడీలో ఉంచింది. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆర్‌బీఐ బంగారాన్ని తరలించడానికి ప్రత్యేక విమానంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో రహస్య మిషన్‌ చేపట్టింది. సమాచారం బయటకు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబరు 2022 నుంచి భారత్‌ 214 టన్నుల గోల్డ్‌ను స్వదేశానికి తీసుకువచ్చింది. స్వదేశానికి తరలించడంలో RBI, కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాయి. మరోవైపు.. ప్రస్తుత అనిశ్చిత ప్రపంచ పరిస్థితుల మధ్య దేశీయంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను కలిగి ఉండటం భద్రత దృష్ట్యా ప్రభుత్వం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది.

1990ల తర్వాత ఇంతపెద్ద మొత్తంలో బంగారం స్వదేశానికి చేరుకుంది. అప్పట్లో, చెల్లింపుల సంతులనం సంక్షోభం సమయంలో ప్రభుత్వం విదేశీ బ్యాంకులకు బంగారాన్ని తాకట్టు పెట్టింది. అయితే ప్రామాణిక సమీక్షల నేపథ్యంలో విదేశాల్లో పసిడి నిల్వలు తగ్గించుకోవాలనే యోచనలో ఆర్‌బీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం భారత్‌కు చెందిన 324 టన్నుల బంగారు నిల్వలు UKలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ల సంరక్షకత్వంలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 1697 నుండి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులో బంగారాన్ని నిల్వ చేస్తోంది. ఇక ఈ సంవత్సరం ఇంగ్లండ్ నుంచి మరిన్ని బంగారు రవాణా జరిగే అవకాశం లేదు. ఇక భారత్‌లో బంగారం ధరలు 9.3 శాతం పెరిగాయి. ప్రాచ్యదేశాల్లో ఆర్థిక అనిశ్చితి, సంఘర్షణల మధ్య పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నందున వచ్చే ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర రూ.85,000కు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ముంబైలో 10 గ్రాములకు రూ.78,745 వద్ద బంగారం ధరలు పలుకుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.