IPhone Exports: మేడ్ ఇన్ ఇండియా కల సాకారం.. ఏకంగా 30 శాతం పెరిగిన ఐఫోన్ ఎగుమతులు
IPhone Exports: మేడ్ ఇన్ ఇండియా కల సాకారం.. ఏకంగా 30 శాతం పెరిగిన ఐఫోన్ ఎగుమతులు ప్రపంచ దేశాలతో పోలిస్తే తయారీ రంగం భారతదేశంలో అధికంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు చైనా తయారీ రంగంలో అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న జనాభాకు అనుగుణంగా తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా పేరుతో కంపెనీలకు ప్రత్యేక రాయితీలను ఇచ్చింది. దీంతో అన్ని కంపెనీలు భారతదేశంలో తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కూడా భారతదేశంలో తమ ఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఐఫోన్ ఎగుమతుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 2024 వరకు ఆరు నెలల్లో భారతదేశంలో తయారు చేసిన దాదాపు ఆరు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే 30 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొంటున్నాయి. యాపిల్ కంపెనీకు చెందిన మూడు కీలక సరఫరాదారులు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, టాటా ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో తమ అసెంబ్లీ కార్యకలాపాల ద్వారా ఈ విస్తరణను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫాక్స్కాన్, చెన్నై యాపిల్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీల భారతదేశ ఐఫోన్ ఎగుమతుల్లో దాదాపు సగం వాటాను కలిగి ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్, విస్ట్రన్ కార్పొరేషన్ కంపెనీల నుంచి గత సంవత్సరం తన ఫ్యాక్టరీని కొనుగోలు చేసింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కర్ణాటక ప్లాంట్ నుంచి సుమారు 1.7 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసిందని నివేదికలో వెల్లడైంది.
ముఖ్యంగా ఐఫోన్ ఉత్పత్తులో మెరుగుదల కారణంగా ఈ స్థాయి ఎగుమతులు సాధ్యమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో తయారైన ఫోన్‌లు యునైటెడ్ స్టేట్స్‌కు అగ్ర ఎగుమతి వర్గంగా మారాయి. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 2.88 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్‌లను యునైటెడ్ స్టేట్స్‌కు ఎగుమతి చేశారంటే భారతదేశంలో తయారైన ఫోన్లకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అయితే ఐదేళ్ల క్రితం కేవలం 5.2 మిలియన్ల డాలర్ల యాపిల్ ఫోన్‌లను ఉత్పత్తి నుంచి ప్రస్తుతం ప్రపంచంలో 30 శాతం ఫోన్‌లు భారతదేశంలో తయారవుతున్నాయంటే మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంత సక్సెస్ అయ్యిందో? అర్థం చేసుకోవచ్చు. యాపిల్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 14 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఇది మునుపటి సంవత్సరం ఉత్పత్తి కంటే రెట్టింపుగా ఉంది.
భారతదేశాన్ని కీలకమైన తయారీ కేంద్రంగా స్థాపించడానికి కంపెనీ స్థానిక సబ్సిడీలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఈ విస్తరణలో ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడల్స్ కూడా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే భారతదేశంలో ఎయిరాడాను ఉత్పత్తి చేయడానికి ఆపిల్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. యాపిల్ కూడా భారతదేశంలో తన రిటైల్ ఉనికిని కూడా పటిష్టం చేసుకుంది. ముంబై, ఢిల్లీలో ఫ్లాగ్లిప్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే బెంగళూరు, పూణేల్లో స్టోర్స్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..