AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Drugs: గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ మూడు క్యాన్సర్ మందుల ధరలు!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌కు వాడే మూడు మందుల ధరలను తగ్గించాలని మందుల తయారీ కంపెనీలను ఆదేశించింది. ఈ మూడు ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది..

Cancer Drugs: గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ మూడు క్యాన్సర్ మందుల ధరలు!
Subhash Goud
|

Updated on: Oct 30, 2024 | 2:05 PM

Share

కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు , జిఎస్‌టి తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మూడు క్యాన్సర్ నిరోధక మందుల ధరలను తగ్గించాలని కంపెనీలను ప్రభుత్వం కోరింది . సరసమైన ధరలకు ఔషధాల లభ్యతను నిర్ధారించాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) మూడు క్యాన్సర్ నిరోధక ఔషధాలైన ట్రాస్టూజుమాబ్ , ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్‌లపై ఎమ్మార్పీ ధరలను తగ్గించాలని సంబంధిత తయారీదారులను ఆదేశిస్తూ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ఈ మూడు క్యాన్సర్ నిరోధక మందులను కస్టమ్స్ సుంకం నుండి మినహాయిస్తూ చేసిన ప్రకటనకు అనుగుణంగా, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మూడు ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూలై 23న నోటిఫికేషన్ జారీ చేసింది. తదనుగుణంగా మార్కెట్లో ఈ ఔషధాల ఎమ్మార్పీ తగ్గింపు ఉండాలని, తగ్గిన పన్నులు, సుంకాల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అందువల్ల, పైన పేర్కొన్న ఔషధాల తయారీదారులందరినీ వారి ఎంఆర్‌పీని తగ్గించాలని ఎన్‌పీపీఏ ఆదేశించింది. తయారీదారులు డీలర్లు, రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్లు, ప్రభుత్వానికి మార్పులను సూచిస్తూ ధరల జాబితా లేదా అనుబంధ ధరల జాబితాను జారీ చేయాల్సి ఉంటుంది. ధర మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌పీపీఏకి సమర్పించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.

లోక్‌సభలో 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్రస్టుజుమాబ్, ఒసిమెర్టినిబ్ మరియు దుర్వాలుమాబ్‌లపై కస్టమ్స్ సుంకాలను 10 శాతం నుండి శూన్యానికి తగ్గించాలని ప్రతిపాదించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి