AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold rates: టాప్ గేర్‌లో పసిడి పరుగులు.. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి ధర.. కారణాలు ఇవే..!

బంగారంపై పెట్టుబడి అనేది అత్యంత సురక్షితమైన, నమ్మకమైన విధానం. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు దీనిలోనే తమ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. బంగారానికి డిమాండ్ ఎప్పుడూ పెరుగుతూ ఉండడం దీనికి ముఖ్య కారణం. మన దేశంలో బంగారం కొనడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పండగలు, శుభకార్యాలతో పాటు అనేక సందర్భాలలో బంగారు ఆభరణాల వినియోగం ఉంటుంది.

Gold rates: టాప్ గేర్‌లో పసిడి పరుగులు.. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి ధర.. కారణాలు  ఇవే..!
Gold PriceImage Credit source: Getty Images
Nikhil
|

Updated on: Sep 28, 2024 | 3:45 PM

Share

బంగారంపై పెట్టుబడి అనేది అత్యంత సురక్షితమైన, నమ్మకమైన విధానం. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు దీనిలోనే తమ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. బంగారానికి డిమాండ్ ఎప్పుడూ పెరుగుతూ ఉండడం దీనికి ముఖ్య కారణం. మన దేశంలో బంగారం కొనడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పండగలు, శుభకార్యాలతో పాటు అనేక సందర్భాలలో బంగారు ఆభరణాల వినియోగం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని బాగా ఇష్టపడతారు. మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పరుగులు పెడతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలో నెలకొన్న వివిధ పరిస్థితులు కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి కారణమయ్యాయి.

పెరిగిన డిమాండ్

బంగారానికి సాధారణంగానే డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో నెలకొన్ని యుద్ద వాతావరణంతో మరింత పెరిగింది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడంతో సురక్షితమైన మార్గంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర శర వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పరస్పరం దాడులతో వివాదం ముదిరిపోతోంది. అలాగే డాలర్ బలహీన పడడంతో పాటు యూఎస్ బాండ్ ఈల్ట్ లలో క్షీణత నమోదైంది. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు బంగారంపై తమ డబ్బులను ఖర్చుచేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం బుధవారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. జౌన్స్ 2700 డాలర్లు పలికింది. అలాగే మన దేశంలో పది గ్రాముల బంగారం రూ.76 వేలకు చేరుకుంది.

వెండి మెరుపులు

బంగారం వెంటే వెండి కూడా పరుగులు పెడుతోంది. దాదాపు తొమ్మిది వారాల్లో అత్యుత్తమ స్థాయిని తాకింది. ప్రపంచంలో అనిశ్చిత కారణంగా ప్రజలు బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి మరిన్ని ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. చైనా తన కీలక బ్యాంకు రేటును 0.5 శాతం తగ్గించింది. దీంతో బంగారం, వెండిని ప్రజలు కొనుగోలు చేయడానికి వీలైంది. అలాగే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్నసంఘర్షణ కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణం. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు తగ్గింపుల కోసం అంచనాలను పెంచడం, కార్మిక మార్కెట్ పై ఆందోళనలు, యూఎస్ ట్రెజరీ దిగుబడులు తగ్గడం, యూఎస్ డాలర్ 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం తదితర కారణాలు బంగారం ధరల పెరుగుదలకు కారణాలు. ప్రధానంగా డాలర్ బలహీనత, యూఎస్ బాండ్ ఈల్ట్ లలో క్షీణత తో స్పాట్ గోల్డ్ ధరలు తాజాగా గరిష్ట స్థాయి తాకాయి. చైనా తమ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా రూపొందించిన తాజా విధానాలు వెండి ధరలను పెంచాయి. ప్రస్తుతం బంగారం ధరలు హైస్పీడ్ లో పరుగులు పెడుతున్నాయి. దేశంలో పది గ్రాములు రూ.76 వేలు, విదేశాల్లో జౌన్స్ 2700 డాలర్లకు చేరుకుంది. బంగారం వెనకే వెండి కూడా పరిగెడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..