UPI payments: యూపీఐ చార్జీలపై యూజర్ల షాకింగ్ నిర్ణయం.. 75 శాతం మంది ఏంచెప్పారంటే..?
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల శకం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ఉపయోగించి నగదు లావాదేవీలు జరుపుతున్నారు. దీని ద్వాారా డబ్బులు చెల్లించడం చాలా సులభంగా ఉండడంతో ఆదరణ పెరిగింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ అనేక లావాదేవీలకు యూపీఐ మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల శకం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ఉపయోగించి నగదు లావాదేవీలు జరుపుతున్నారు. దీని ద్వాారా డబ్బులు చెల్లించడం చాలా సులభంగా ఉండడంతో ఆదరణ పెరిగింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ అనేక లావాదేవీలకు యూపీఐ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధానం లేనప్పుడు నగదు కొనుగోళ్లు జరిగేవి. బయటకు వెళితే డబ్బులు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ముఖ్యంగా చిల్లర సమస్య వేధించేది. యూపీఐ చెల్లింపులతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పడింది. ప్రస్తుతం ఈ చెల్లింపుల విధానంలో మనకు అదనపు చార్జీలు ఏమీ వసూలు చేయరు. కానీ చెల్లింపులకు చార్జీలు పెడితే ఎంత యూపీఐని ఎంత మంది వినియోగిస్తారనే అనే అంశంపై ఇటీవల సర్వే చేశారు. దానిలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
యూపీఐ చెల్లింపుల విధానంలో దేశంలో ఎంతో ఆదరణ పొందింది. రోడ్డు పక్కన తోపుడు బళ్ల నుంచి స్టార్ హాటళ్ల వరకూ దీని ద్వారా చెల్లింపులు జరపొచ్చు. మన బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలు ఎక్కడైనా నిరభ్యతరంగా వాడుకోవచ్చు. ఈ విధానంలో లాావాదేవీలు సులభం కావడంతో పాటు పారదర్శకత పెరిగింది. దాదాపు 38 శాతం మంది తమ వ్యాపారాలలో యూపీఐ చెల్లింపులు కీలకంగా మారాయన్నారు. మరో 37 శాతం మంది తాము లావాదేవీలన్నింటిని ఆ విధానంలో చేస్తున్నట్టు వెల్లడించారు. యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తే ఏమతుందని అనే అంశంపై ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విధానంలో చాలా సులువుగా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ చార్జీలు విధిస్తే వినియోగించబోమని తెలిపారు.
సర్వేలో పాల్గొన్న దాదాపు 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఐలో ఈ విధానంలో వస్తే దాదాపు వాడకం నిలిచిపోతుందన్నారు. అయితే 22 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఆర్థిక లావాదేవీలు చాలా సులువగా జరుగుతున్నాయి కాబట్టి చార్జీలు వసూలు చేసినా తాము వినియోగిస్తామని తెలిపారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ సర్వేను జరిపారు. దేశంలోని 325 జిల్లాలలో 44 వేల మంది అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణుల నుంచి సమాచారం సేకరించారు. చాలామంది చార్జీల ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. అవి అమలైతే తాము యూపీఐని వినియోగంచబోమని స్పష్టం చేశారు. కాబట్టి యూపీఐ విధానంతో డిజిటల్ చెల్లింపులు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో చార్జీలు అమలు చేస్తే ప్రజాదరణ తగ్గిపోయే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..