Business Idea: కాసులు కురిపించే కొత్త బిజినెస్‌.. లాభాల పంట పండాల్సిందే..

సాధారణంగా ఐస్‌క్రీమ్‌కు ఉండే డిమాండ్‌ ఎలాంటిదో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఐస్‌క్రీమ్‌ను ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే ఈ ఐస్‌క్రీమ్‌ తయారీలోనే తాజాగా సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అదే స్నోఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్ ఐస్‌క్రీమ్‌. చూడ్డానికి చాలా ఆకర్షీణయంగా కనిపించడమే కాకుండా రుచి విషయంలో...

Business Idea: కాసులు కురిపించే కొత్త బిజినెస్‌.. లాభాల పంట పండాల్సిందే..
Business Idea
Follow us

|

Updated on: Sep 28, 2024 | 11:34 AM

వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించాలంటే అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. ఇందుకోసం రకరకాల కొత్త మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తుంటారు. అందుకే మార్కెట్లో అప్పటి వరకు లేని, డిమాండ్‌ ఎప్పటికీ తగ్గని బిజినెస్‌ను ఎంచుకోవాలని సూచిస్తుంటారు. అయితే చాలా మంది కొత్త వ్యాపారాలను ప్రారంభించాలంటే నష్టాలు వస్తాయేమో అన్న భయంతో ఉంటారు. కానీ సరైన అవగాహన, మార్కెట్‌ ట్రెండ్‌ను అర్థం చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలు వాటంతటవే వస్తాయి. అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఐస్‌క్రీమ్‌కు ఉండే డిమాండ్‌ ఎలాంటిదో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఐస్‌క్రీమ్‌ను ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే ఈ ఐస్‌క్రీమ్‌ తయారీలోనే తాజాగా సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అదే స్నోఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్ ఐస్‌క్రీమ్‌. చూడ్డానికి చాలా ఆకర్షీణయంగా కనిపించడమే కాకుండా రుచి విషయంలో కూడా సూపర్‌ అనేలా ఉంటుందీ స్నో ఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్‌. ఈ ఐస్‌క్రీమ్‌ను పాలు, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్‌, చెరుకు రసం వంటి వాటితో తయారు చేయొచ్చు.

ఇందుకోసం స్నో ఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్‌ తయారీ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మిషిన్‌లో జ్యూస్ లేదా డ్రింక్స్‌ను వేస్తే చాలు.. బయటకు స్నో ఫ్లేక్స్‌ రూపంలో వస్తాయి. వీటిని ఒక కప్పులో వేసి అందిస్తారు. వీటిపైన డ్రై ఫ్రూట్స్‌ లేదా చెర్రీల వంటి వాటిని డెకరేట్ చేసి అందించవచ్చు. మంచి రద్దీ ఉన్న ఏరియాల్లో ఇలాంటి మిషిన్స్‌ను ఏర్పాటు చేసుకుంటే భారీగా లాభౄలు పొందొచ్చు. ఈ మిషన్‌ ధర దాదాపు రూ. 50 వేలుగా ఉంటుంది. ఇక పెళ్లిళ్లలో కూడా ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇక లాభాల విసయానికొస్తే.. ఒక్క ఐస్‌క్రీమ్‌ తయారు చేయడానికి సుమారు రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. సరాసరి వీటిని రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించుకోవచ్చు. ఎంత కాదన్న ఒక్క ఐస్‌క్రీమ్‌పై తక్కువలో తక్కువ రూ. 35 లాభం కచ్చితంగా వస్తుంది. ఈ లెక్కన రోజుకు 100 ఐస్‌క్రీమ్‌లను విక్రయించినా రూ. 3500 లాభం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..