Govt Apps: మీ ఫోన్‌లో ఈ 5 ప్రభుత్వ యాప్‌లు ఉన్నాయా?.. ఉపయోగం ఏంటి?
ఒకప్పుడు పని కోసం ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్ నుండి పూర్తి చేయగల అనేక పనులు ఉన్నాయి. ప్రభుత్వ సేవలు చాలా వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అనేక మొబైల్ యాప్‌లను..
ఒకప్పుడు పని కోసం ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్ నుండి పూర్తి చేయగల అనేక పనులు ఉన్నాయి. ప్రభుత్వ సేవలు చాలా వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అనేక మొబైల్ యాప్‌లను ప్రారంభించింది.
స్మార్ట్‌ఫోన్ కోసం 5 ముఖ్యమైన ప్రభుత్వ యాప్‌లు
- ఉమంగ్ యాప్: ఏం పనిచేస్తుంది: ఉమంగ్ యాప్ అనేది ఒకే ప్లాట్‌ఫారమ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సేవలను అందించే మొబైల్ యాప్. ఉమంగ్ యాప్ సహాయంతో, మీరు పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, గ్యాస్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్, రైలు టిక్కెట్ బుకింగ్ వంటి అనేక పనులను చేయవచ్చు.
- డిజిలాకర్ యాప్: ఈ యాప్‌తో ఉపయోగం ఏంటి? ఇది డిజిటల్ లాకర్. ఇక్కడ మీరు అన్ని ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచవచ్చు. ఈ యాప్‌లో మీరు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, మార్క్‌షీట్‌ల వంటి పత్రాలను డిజిటల్ రూపంలో స్టోర్ చేయవచ్చు.
- mPassport సర్వీస్: ఈ యాప్‌తో ఉపయోగం ఏంటి?: ఈ ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్‌కు సంబంధించిన అన్ని పనులను ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఈ యాప్ సహాయంతో మీరు అపాయింట్‌మెంట్ బుకింగ్ చేయవచ్చు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
- ఎం-పరివాహన్: దీని ఉపయోగం ఏంటి?: ఈ యాప్ సహాయంతో మీరు మీ వాహన పత్రాల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. అవి వర్చువల్ ఆర్‌సీ, వర్చువల్ డీఎల్, ఆర్‌సీ శోధన, డీఎల్ శోధన, డూప్లికేట్ ఆర్‌సీ, యాజమాన్య బదిలీ, హైపోథెకేషన్ తొలగింపు, మరెన్నో పని చేయవచ్చు.
- mAadhaar: ఈ యాప్ ద్వారా ఏం చేయవచ్చు: ఈ యాప్ సహాయంతో మీరు మీ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం, ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్, ఆధార్ వెరిఫై చేయడం, ఇమెయిల్/మొబైల్ వెరిఫై చేయడం వంటి పనులను చాలా సులభంగా చేయవచ్చు.
ఈ యాప్‌లు కాకుండా, అనేక ఇతర ప్రభుత్వ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు మీ అవసరానికి అనుగుణంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్‌లను Google Play Store లేదా Apple App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి