AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Health IPO: నవంబర్ 30 నుంచి స్టార్ హెల్త్ ఐపీవో.. ఒక్కో షేరుకు రూ. 870-900గా నిర్ణయం..

సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా, వెస్ట్‌బ్రిడ్జ్, ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా-ప్రమోట్ చేసిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓగా రానుంది. పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేరుకు రూ. 870-900 ధరను నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2, 2021న ముగుస్తుంది....

Star Health IPO: నవంబర్ 30 నుంచి స్టార్ హెల్త్ ఐపీవో.. ఒక్కో షేరుకు రూ. 870-900గా నిర్ణయం..
Ipo
Srinivas Chekkilla
|

Updated on: Nov 24, 2021 | 10:56 AM

Share

సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా, వెస్ట్‌బ్రిడ్జ్, ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా-ప్రమోట్ చేసిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓగా రానుంది. పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేరుకు రూ. 870-900 ధరను నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2, 2021న ముగుస్తుంది. ఐపీఓలో రూ. 2,000 కోట్ల విలువైన షేర్ల తాజా జారీ చేయనున్నారు. ప్రమోటర్లు సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా LLP, KONARK ట్రస్ట్ & MMPL ట్రస్ట్‌తో సహా అనేక మంది వాటాదారులచే 5.83 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.

APIS గ్రోత్ 6, MIO IV స్టార్, MIO స్టార్, యూనివర్శిటీ ఆఫ్ నోట్రే డామ్ DU LAC, ROC క్యాపిటల్ Pty లిమిటెడ్, వెంకటసామి జగన్నాథన్, సాయి సతీష్, బెర్జిస్ మినూ దేశాయ్ కూడా OFS ద్వారా కంపెనీలో కొంత వాటాను ఇస్తారు. కంపెనీ తన ఉద్యోగుల కోసం రూ.100 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టార్ హెల్త్ రూ. 7,249.18 కోట్లను సమీకరించనుంది. ప్రస్తుత సంవత్సరం 2021లో ఇష్యూ పరిమాణంలో ఇది మూడవ అతిపెద్ద IPOదా ఉంది. పెట్టుబడిదారులు కనీసం ఒక్క లాట్ కొనాల్సి ఉంటుంది. ఒక్క లాట్‎లో 16 ఈక్విటీ షేర్లు ఉంటాయి. లాట్ కొనుగోలు చేయాలంటే రూ. 14,400 పెట్టాలు. గరిష్ఠంగా 13 లాట్‎లు కొనుగోలు చేయవచ్చు. 13 లాట్‎లు కొనుగోలు చేయాలంటే రూ. 1,87,200 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

స్టార్ హెల్త్ ప్రాథమికంగా రిటైల్ ఆరోగ్యం, సమూహ ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాదం, విదేశీ ప్రయాణాల కోసం సమగ్రమైన బీమా కవరేజ్ ఎంపికలను అందిస్తుంది. FY21లో భారతీయ ఆరోగ్య బీమా మార్కెట్‌లో 15.8 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థగా స్టార్ హెల్త్ నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీలో రాకేష్ జున్‌జున్‌వాలా, సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా LLP, వెస్ట్‌బ్రిడ్జ్ AIF Iతో సహా ప్రమోటర్లకు కంపెనీలో 66.22 శాతం వాటా ఉంది. రాకేష్ ఝున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలా సంయుక్తంగా 18.21 శాతం వాటాతో కంపెనీలో రెండవ అతిపెద్ద వాటాదారుగా ఉండగా, సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా LLP 47.77 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది.

డిసెంబర్ 7, 2021 నాటికి షేర్ కేటాయింపు చేస్తారు. షేర్లు రాని వారికి డిసెంబర్ 8 నాటికి వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బు రిఫండ్ అవుతుంది. డిసెంబర్ 9 నాటికి వారి డీమ్యాట్ ఖాతాలలో వాటాలను యాడ్ చేస్తారు. స్టార్ హెల్త్ కేర్ డిసెంబర్ 10 స్టాక్ మార్కెట్‎లో లిస్ట్ అవనుంది.

Read Also.. Cheating: బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లను మోసం చేస్తే దుకాణదారులకు ఎలాంటి శిక్ష ఉంటుంది..?