Cheating: బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లను మోసం చేస్తే దుకాణదారులకు ఎలాంటి శిక్ష ఉంటుంది..?

Cheating: దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరతరం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో అభరణాలను కొనుగోలు చేసే..

Cheating: బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లను మోసం చేస్తే దుకాణదారులకు ఎలాంటి శిక్ష ఉంటుంది..?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 24, 2021 | 9:34 AM

Cheating: దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరతరం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో అభరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు కూడా కొన్ని మోసాలకు గురవుతుంటారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న బంగారు అభరణాలపై వినియోగదారుల రక్షణ చట్టం 2019 కూడా వర్తిస్తుంది. అభరణాలపై చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుకాణదారుడు వినియోగదారున్ని మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. సాధారణంగా దుకాణదారులు 18 క్యారెట్ల నగలు 22 క్యారెట్లుగా చూపించి కస్టమర్లను మోసం చేసే ఉదంతాలు చాలానే ఉన్నాయి. కానీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుకాణదారుడు ఇలా మోసం చేసినట్లయితే లక్ష రూపాయల జరిమానా జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. వినియోగదారులకు జరిగే మోసాలను అరికట్టడమే చట్టం పరిధిలోకి అభరణాలను తీసుకురావడం ప్రధాన లక్ష్యం.

బంగారు అభరణాలపై హాల్‌ మార్కింగ్‌ ఎందుకు..? బంగారు అభరణాలపై ఉన్న హాల్‌ మార్కింగ్‌ ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. ఈ మార్కింగ్‌ అభరణాల స్వచ్ఛతను చూపిస్తుంది. అందువల్ల మీరు బంగారు అభరణాలు కొనేటప్పుడు తప్పనిసరిగా హాల్‌మార్క్‌ ఉన్నవే తీసుకోవాలి. అయితే హాల్‌ మార్క్‌ ఉన్న అభరణాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో వాటిని విక్రయిస్తే మంచి ధర వస్తుంది.

నివేదికల ప్రకారం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 900 హాల్‌మార్కింగ్‌ కేంద్రాలున్నాయి. వీలైనంత త్వరగా ఈ సంఖ్యను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ హాల్‌ మార్కింగ్‌ కేంద్రాలలో మీరు అభరణాలను స్వచ్ఛతను చెక్‌ చేసి కొనుగోలు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం ధర..!

Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర..!