Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిల్వర్ ధర..!
Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్, సిల్వర్..
Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్, సిల్వర్ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏ మాత్రం ఆగవు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను అధికంగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇక తాజాగా మంగళవారం (నవంబర్ 24)న బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో వెండి ధరపై రూ.1600 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 64,000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై లో64,400 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500 ఉండగా, కోల్‌కతాలో రూ.64,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, విజయవాడలో రూ.69,500 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, మధురైలో రూ.69,500 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. ఇక బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి: