AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: లోయర్‌ బెర్త్‌ కోసం రైల్వే కొత్త నిబంధనలు.. అదేంటో తెలుసా?

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రతి ప్రయాణీకుని అవసరాలను తీర్చేందుకు రైల్వే తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కోసం..

Indian Railways: లోయర్‌ బెర్త్‌ కోసం రైల్వే కొత్త నిబంధనలు.. అదేంటో తెలుసా?
s
Subhash Goud
|

Updated on: Jul 27, 2024 | 10:04 AM

Share

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రతి ప్రయాణీకుని అవసరాలను తీర్చేందుకు రైల్వే తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కోసం రైల్వేలో లోయర్ బెర్త్ బుక్ చేసినా దాన్ని పొందలేని పరిస్థితి ఉండేది. ఇందుకు కొన్ని నియమాలను రూపొందించింది ఇండియన్‌ రైల్వే.

ఇది కూడా చదవండి: JioFiber: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో జియో ఫైబర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ అనేక నియమాలను మార్చింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్‌లను బుక్ చేసుకోవచ్చు. సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్‌సీటీసీ తెలియజేసింది. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేయాలి?

ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే, మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు అలాట్‌మెంట్ లభిస్తుందని తెలిపింది. మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేసుకుంటే మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Metro Train: మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో రీల్స్‌.. 1600 మందికి జరిమానా.. షాకిచ్చిన అధికారులు

లోయర్ బెర్త్‌లు మొదట వచ్చిన వారికి మొదటగా కేటాయిస్తారు.

సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. జనరల్ కోటాలో సీటు రావడంలో మానవ జోక్యం లేదు. అయితే, మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈని సంప్రదించవచ్చు. అలాగే మీ కోసం లోయర్ బెర్త్ కోసం మాట్లాడవచ్చు. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే అది మీకు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: New Rules August 1: అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?

మనిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి