Post Office Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? మంచి రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనం

భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి విభాగానికి అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో చాలా చిన్న పొదుపు పథకాలున్నాయి. ఇందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా..

Post Office Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? మంచి రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనం
Post Office Scheme
Follow us

|

Updated on: Feb 04, 2023 | 7:07 PM

భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి విభాగానికి అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో చాలా చిన్న పొదుపు పథకాలున్నాయి. ఇందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో రాబడి అందుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసింది. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా పన్ను ప్రణాళిక చేయకపోతే ఖచ్చితంగా చేయండి. మీరు ఎక్కువ రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందే పథకం కోసం చూస్తున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒకటి. ఇది ప్రభుత్వ పథకం. ఇందులో మీకు 100% భద్రత హామీ లభిస్తుంది. ఈ పథకం కింద మీరు పోస్టాఫీసుతో సహా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

PPF ఖాతా తెరవడానికి అర్హత

ఏదైనా భారతీయ పౌరుడు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, పోస్ట్ ఆఫీస్‌ పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో పీపీఎఫ్‌ ఖాతాను 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఓపెన్‌ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక పీపీఎఫ్‌ ఖాతాను మాత్రమే తెరవవచ్చు. ఈ ఖాతాను 15 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

వడ్డీ రేటు, పన్ను మినహాయింపు వివరాలు

పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి సంవత్సరం 7.1 శాతం వడ్డీ రేటును పొందుతారు. ఈ పథకం మరో ప్రయోజనం ఏంటంటే పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. దీనితో పాటు, ఈ పథకంపై వచ్చే వడ్డీపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

సులభమైన రుణం

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన డబ్బుపై రుణం పొందే సదుపాయం కూడా ఉంది. పీపీఎఫ్‌ ఖాతా తెరిచిన మూడు సంవత్సరాల తర్వాత మీరు లోన్ సదుపాయాన్ని పొందవచ్చు. మీరు ఖాతాలో జమ చేసిన మొత్తంలో 75 శాతం వరకు రుణంగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..