Gautam Adani Loss: గౌతమ్ అదానీ ఒక్క వారంలో ఎన్ని లక్షల ఆస్తి పోగొట్టుకున్నారో తెలుసా..?
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా క్షీణిస్తోంది. దీంతో ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయిన తర్వాత అదానీ ఇప్పుడు..
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా క్షీణిస్తోంది. దీంతో ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయిన తర్వాత అదానీ ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 22 వ స్థానానికి పడిపోయారు. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విడుదల చేయడంతో గౌతమ్ అదానీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలు వారంలో వంద బిలియన్ డాలర్ల (సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు) సంపదను కోల్పోయాయి. ఇవి వ్యాపార నష్టాలు కావు. స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు విలువ కోల్పోయాయి. ఫలితంగా అదానీ వాటా సంపద మొత్తం చాలా పలచబడిపోయింది.
ప్రపంచంలోని టాప్ -3 సంపన్నుల జాబితాలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు 22వ స్థానానికి పడిపోయారు. భారత్‌లో ముఖేష్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. అదానీ గ్రూప్‌పై ఏదైనా విచారణ ప్రారంభమైతే, స్టాక్ పతనం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది .
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇటీవల తన ఎఫ్‌సీఐ పథకాన్ని రద్దు చేసింది. పెట్టుబడిదారులకు 20,000 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా అదానీ కంపెనీల షేర్లు తగ్గలేదు. శుక్రవారం కూడా వివిధ అదానీ కంపెనీల షేర్లు తక్కువ ధరలకు అమ్ముడుపోయాయి .
అలాగే క్రెడిట్ సూయిస్, సిటీ గ్రూప్ వంటి పెద్ద బ్యాంకింగ్ సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీలు జారీ చేసిన బాండ్లను ఉంచడం ద్వారా ప్రైవేట్ కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ఆపివేసాయి. గౌతమ్ అదానీకి భవిష్యత్తులో మూలధనం సమకూర్చడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .
హిండెన్‌బర్గ్ నివేదిక అంటే ఏమిటి?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక అమెరికన్ ఆధారిత షార్ట్ సెల్లర్ సంస్థ. షార్ట్ సెల్లర్ అంటే ఈ కంపెనీలు దిగువకు పడిపోయిన స్టాక్‌లలో పెట్టుబడి పెడతాయి. జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలతో కూడిన నివేదికను విడుదల చేసింది. అదానీ కంపెనీలు మోసం చేశాయి. షేర్ విలువ కృత్రిమంగా పెంచబడింది. అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి .
అలాగే గౌతమ్ అదానీ నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండటం వల్లే ఆయన వ్యాపార సామ్రాజ్యం పెద్దఎత్తున అభివృద్ధి చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దీన్ని అదానీ సున్నితంగా తిరస్కరించారు. తన కెరీర్‌లో తాను ఎదగడానికి ఏ ఒక్క వ్యక్తిగత నాయకుడి వల్ల కాదని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి