Income Tax: కొత్త బడ్జెట్ విధానం.. పాత బడ్జెట్ విధానం.. టాక్స్ లెక్కలు ఇలా..

బడ్జెట్ వస్తోంది అనగానే టాక్స్ పేయర్స్ ఆతృతగా.. ఆసక్తిగా.. ఒకింత ఆందోళనగా ఎదురుచూడటం సహజం. ప్రతీ బడ్జెట్ ముందూ ఇదే జరుగుతుంది. ఇప్పుడూ అదే జరిగినది. అయితే, బడ్జెట్ వచ్చింది. మరి టాక్స్ పేయర్స్ కోరికలు ఎంత వరకూ తీరాయి..

Income Tax: కొత్త బడ్జెట్ విధానం.. పాత బడ్జెట్ విధానం.. టాక్స్ లెక్కలు ఇలా..
Income Tax
Follow us

|

Updated on: Feb 02, 2023 | 7:40 PM

బడ్జెట్ వస్తోంది అనగానే టాక్స్ పేయర్స్ ఆతృతగా.. ఆసక్తిగా.. ఒకింత ఆందోళనగా ఎదురుచూడటం సహజం. ప్రతీ బడ్జెట్ ముందూ ఇదే జరుగుతుంది. ఇప్పుడూ అదే జరిగినది. అయితే, బడ్జెట్ వచ్చింది. మరి టాక్స్ పేయర్స్ కోరికలు ఎంత వరకూ తీరాయి? వారికి ఈ బడ్జెట్ లో ఏదైనా లాభం దొరికిందా? బడ్జెట్‌లో పన్ను విధానం గురించి తెలుసుకుందాం.

బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 ప్రధాన ప్రకటనలు చేశారు. ఇప్పుడు మీరు కొత్త పన్ను విధానం లాభదాయకంగా ఉందా లేదా పాతదా అని ఆలోచిస్తూ ఉండాలి. మీ జీతం సంవత్సరానికి 10 లక్షల వరకు ఉంటే, అలాగే మీరు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే పాత పన్ను విధానం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఎలానో తెలుసుకుందాం.

పాత పన్ను విధానం నుంచి పన్ను లెక్కింపు గురించి తరువాత మాట్లాడుదాం. ముందుగా ఈ బడ్జెట్‌లో విడుదల చేసిన కొత్త పన్ను వ్యవస్థకు సంబంధించిన ప్రకటనలు, అలాగే ఎవరు ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది అనే అంశాలను పరిశీలిద్దాం.

ఇవి కూడా చదవండి

7 లక్షల ఆదాయంపై ఆర్థిక మంత్రి పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చారు. పన్ను శ్లాబులు మార్చారు. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా చేర్చారు. అధిక సంపాదనపరులకు అధిక సర్‌ఛార్జ్ రేటును తగ్గించారు. అలాగే పదవీ విరమణ సమయంలో స్వీకరించిన సెలవు ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను పరిమితిని పెంచారు.

కొత్త పన్ను విధానంలో మీ జీతంపై ఎంత పన్ను విధించే అవకాశం ఉంది?

విశాఖపట్నానికి చెందిన టాక్స్ కన్సల్టెంట్ పృధ్వీ కొత్త పన్ను విధానంలో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా చేర్చరని వివరించారు. అంటే రూ.7.5 లక్షల వరకు జీతంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.7.5 లక్షల జీతంపై ముందుగా స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 తీసివేయండి. మిగిలిన 7 లక్షల రూపాయలు. మీరు 7 లక్షల రూపాయలకు చేరుకున్న వెంటనే, మీరు రిబేట్ పరిధిలోకి వస్తారు. పూర్తి పన్ను మినహాయింపు పొందుతారు.

మీ జీతం రూ. 10, 15 లేదా 20 లక్షలు అయితే మీరు రూ. 50,000 మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్ పొందుతారు. స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందిన తర్వాత మీరు ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో గ్రాఫిక్స్‌లో చూద్దాం..

మీ ఆదాయం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అయితే కనుక.. మీకు 3 లక్షల రూపాయల వరకూ 0% పన్ను ఉంటుంది. అలాగే 3 నుంచి 6 లక్షల రూపాయల వరకూ 5% అంటే 15 వేలు టాక్స్, 6 నుంచి 9 లక్షల రూపాయల వరకూ 10% అంటే 30 వేలు టాక్స్, అదేవిధంగా 9 నుంచి 10 లక్షల రూపాయల వరకూ 15% అంటే 7.5 వేలు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. మొత్తం గా కట్టాల్సిన టాక్స్ 52.5 వేల రూపాయలు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ 50 వేలు తీసివేసి లెక్క చేశారు.

అలాగే మీ ఆదాయం సంవత్సరానికి 15 లక్షల రూపాయలు అయితే గ్రాఫిక్స్‌లో చూపించిన విధంగా మీరు మొత్తం టాక్స్ 1.4 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీ ఆదాయం సంవత్సరానికి 20 లక్షల రూపాయలు అయితే, గ్రాఫిక్స్‌లో చూపించిన విధంగా మీరు మొత్తం టాక్స్ 2.85 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది.

కొత్త పన్ను విధానంపై లెక్కలు ఇవి

పాత పన్ను విధానంలో ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం..

పాత విధానంలో కూడా మీ వార్షిక జీతం 7 లక్షలు అయితే 7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 0 పన్ను . ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 సెక్షన్ 80C గరిష్ట మినహాయింపు 1.5 లక్షలు ఇందులో మొత్తం 2 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అంటే మిగిలిన ఆదాయం 5 లక్షలు. సెక్షన్ 87(A) ప్రకారం.. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. అంటే 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు.

పాత పన్ను ఆప్షన్‌లో కూడా 10 లక్షల వరకు ఆదాయం పన్నుమినహాయింపు ఈ బడ్జెట్‌లో, పాత పన్ను ఎంపికలో కూడా ఆదాయపు పన్నులో ఉపశమనం లేదు. ఏటా 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం 5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఉంటే మీరు 20% వరకు పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టంలో ఇటువంటి అనేక నిబంధనలు ఉన్నాయి. వాటి నుండి మీరు ఆదాయపు పన్ను లేకుండా చేయవచ్చు. ఈ లెక్క పూర్తిగా గ్రాఫిక్స్‌లో చూసి అర్ధం చేసుకోండి.

Tax 1

మొత్తం పన్ను ఎలా ఆదా అవుతుందో తెలుసుకుందాం..

ఆదాయపు పన్ను సెక్షన్ 87A ప్రయోజనాన్ని పొంది రూ. 10 లక్షల ఆదాయం నుంచి రూ. 5 లక్షలను తీసివేయండి. అప్పుడు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షలు అవుతుంది. స్టాండర్డ్ డిడక్షన్‌లో, రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి తీసివేస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.4.5 లక్షలు అవుతుంది. 80C కింద మీరు 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. దీని కోసం, ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, మ్యూచువల్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 5 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, నేషనల్ పెన్షన్ సిస్టమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టాలి. వీటిలో ఏదైనా ఒకదానిలో లేదా అనేక ప్లాన్‌ల కలయికలో గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. మీరు ఇలా చేసి ఉంటే రూ. 4.5 లక్షల నుంచి రూ. 1.50 లక్షలను తీసివేయండి. ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.3 లక్షలుగానే ఉంటుంది.

మీరు గృహ రుణం తీసుకున్నట్లయితే ఆదాయపు పన్ను సెక్షన్ 24బీ కింద మీకు 2 లక్షల వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. దీన్ని కూడా మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తీసివేయండి. అంటే ఇప్పుడు రూ.లక్ష ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌)లో ప్రత్యేకంగా రూ. 50,000 వరకు పెట్టుబడి పెడితే, సెక్షన్ 80CCD (1B) కింద మీకు అదనంగా రూ. 50,000 మినహాయింపు లభిస్తుంది.

80డి కింద మెడికల్ పాలసీ తీసుకోవడం ద్వారా రూ.25,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ ఆరోగ్య బీమాలో మీరు మీ భార్య, పిల్లలకు పేరు పెట్టాలి. ఇది కాకుండా మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే వారి పేరు మీద ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం ద్వారా మీరు రూ. 50,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా మీరు రూ. 10 లక్షల ఆదాయంపై పూర్తి పన్నును ఆదా చేయవచ్చు.

మీకు 15 లక్షల ఆదాయం ఉన్నా కేవలం 10 లక్షలపైనే పన్ను..

Tax 2

మీ వార్షిక ఆదాయం 15 లక్షలు అయితే 1 లక్షా 87 వేల 500 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 87A మినహా మీరు పైన పేర్కొన్న నిబంధనలను అనుసరించడం ద్వారా 5 లక్షల పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. దీని తర్వాత మీరు 10 లక్షల ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించాలి.

మీకు 20 లక్షల ఆదాయం ఉన్నా 15 లక్షలపైనే పన్ను..

Tax 3

మీ వార్షిక ఆదాయం 15 లక్షలు అయితే 3 లక్షల 37 వేల 500 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కూడా 87A మినహాపై నిబంధనలను అనుసరించడం ద్వారా మీరు 5 లక్షల పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. దీని తర్వాత మీరు 15 లక్షల ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించాలి. ఈ లెక్కలు టాక్స్ విధానాన్ని వివరించడం కోసం సుమారుగా వేసినవి. వాస్తవ లెక్కలలో కొద్దిగా మార్పులు ఉండవచ్చు. మీ ఆదాయంపై ఎంత టాక్స్ పడుతుంది అనే పూర్తి లెక్కలను మీ ఫైనాన్షియల్ ఎక్స్ పార్ట్ వద్ద తెలుసుకోండి.

Tax 4

ఆదాయపు పన్ను పై కొంత ఊరట వస్తుందని భావిస్తున్న వారికి పాత.. కొత్త విధానాలలో గందరగోళం తెచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు టాక్స్ విధానంలో మార్పులు మీ ఆదాయ వనరుల పై ఆధారపడి మీరు ఎంచుకున్న టాక్స్ విధానాల అనుగుణంగా ఉంటాయనేది వాస్తవం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు