Maruti Suzuki Fronx: ఇతర వాహనాలకు గట్టిపోటీగా మారుతి సుజుకీ ఫ్రాంక్స్.. లాంచ్‌కు ముందే వేలాది బుకింగ్స్
మార్కెట్లో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మారుతి సుజుకి..
మార్కెట్లో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మారుతి సుజుకి జనవరి 12, 2023న జరిగిన ఆటో ఎక్స్‌పో 2023 లో ఫ్రాంక్స్ క్రాస్‌ఓవర్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ అదే రోజు రూ.11,000తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ బుకింగ్‌లను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఫ్రాంక్స్ ఏప్రిల్ 2023లో ప్రారంభించటానికి ముందు 5,500 బుకింగ్‌లు వచ్చినట్లు మారుతి సుజుకి తెలిపింది. రాబోయే క్రాసోవర్ దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా రిటైల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ వివిధ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.
6 సింగిల్-టోన్, 3 డ్యూయల్-టోన్‌తో సహా 9 రంగు ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. సింగిల్-టోన్ రంగులు నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, ఓపులెంట్ రెడ్, గ్రాండ్యుర్ గ్రే, ఎర్టెన్ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, డ్యూయల్-టోన్ కలర్స్‌లో ఎర్టెన్ బ్రౌన్ విత్ బ్లూష్ బ్లాక్, ఓపులెంట్ రెడ్ విత్ బ్లూష్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లూష్ బ్లాక్‌లో రానుంది. ఇందులో NEXWave గ్రిల్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఆటోమేటిక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ముందు, వెనుక బంపర్‌లో క్రోమ్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి. ఈ వాహనం 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది.
కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, ఏఎంటీమూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్ తో వస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి