AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kusum Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముఖ్యంగా రైతుల కోసం కూడా స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ రైతుల కోసం ఓ పథకంపై..

PM Kusum Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు
Pm Kusum Scheme
Subhash Goud
|

Updated on: Feb 04, 2023 | 3:14 PM

Share

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముఖ్యంగా రైతుల కోసం కూడా స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ రైతుల కోసం ఓ పథకంపై శుభవార్త అందించింది. పీఎం కుసుమ్ యోజన కాలవ్యవధిని మార్చి 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష అండ్ ఉత్తన్ మహభియాన్ స్కీమ్‌ను 2019లో ప్రవేశపెట్టింది కేంద్రం. 2022 నాటికి 30,800 మెగావాట్ల అదనపు సౌర సామర్థ్యాన్ని కలిగి ఉండాలనేది లక్ష్యంతో రూ.34,422 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం కాలవ్యవధిని మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు కేంద్రం సోలాప్ పంపుల ఏర్పాటుకు సబ్సిడీ దించడంతో పాటు.. సోలార్ ఎనర్జీని పెంపు కోసం కృషి చేస్తోంది. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ పథకం అమలు వేగం గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. దేశంలోని 39 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో 9 ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికోసం పీఎం కుసుమ్‌ యోజన కాలవ్యవధిని 2026 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ప్రాజెక్టుల అమలుకు గడువును పొడిగించాలని రాష్ట్రాలు, అమలు సంస్థలు ప్రభుత్వాన్ని కోరడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

పీఎం కుసుమ్ యోజనతో ఎలాంటి ప్రయోజనాలు

సోలార్ పంప్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు తమ పొలాలకు ఉచితంగా నీరందించవచ్చు. సోలార్ సిస్టమ్‌ను అమర్చడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గుతుంది. దీంతో భారీ కరెంటు బిల్లుల బాధ తప్పుతుంది. సోలార్ పంప్ ఏర్పాటు నీటిపారుదల పనులకు ఆటంకం కలిగించదు. కరెంటు కోత వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతే కాకుండా.. పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంప్ సిస్టమ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. మీరు మీ వినియోగానికి అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే మీరు దానిని విద్యుత్ పంపిణీ కార్పొరేషన్‌కు విక్రయించడం ద్వారా సంపాదించవచ్చు. మీకు ఖాళీగా ఉన్న భూమి ఉంటే, మీరు దానిని ప్రభుత్వానికి లీజుకు ఇవ్వడం ద్వారా సంపాదించవచ్చు. మీ భూమిలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది.

ఈ పథకంలో ఎంత సబ్సిడీ లభిస్తుంది?

ప్రధాన మంత్రి కుసుమ్ యోజనలో రైతులు తమ పొలాల్లో సోలార్ పంపులను అమర్చుకోవడానికి 60% వరకు సబ్సిడీని అందుకోవచ్చు. ఇందులో 30% కేంద్రం, 30% రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బ్యాంకు ద్వారా 30 శాతం రుణం తీసుకోగా, మిగిలిన 10 శాతం రైతులకు ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరం

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డు
  • రిజిస్ట్రేషన్ కాపీ
  • పొలం లేదా భూమి జమాబందీ కాపీ
  • మొబైల్ నంబర్ (ఆధార్‌తో లింక్ చేసింది)
  • బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి