Wheat Sale: ఈ-వేలంలో రెండు రోజుల్లో 9 లక్షల టన్నుల గోధుమలు విక్రయం
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) ఇ - వేలంలో రెండు రోజుల్లో 9 లక్షల టన్నులకు పైగా గోధుమ ధాన్యాన్ని విక్రయించింది. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ మార్కెట్..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) ఇ – వేలంలో రెండు రోజుల్లో 9 లక్షల టన్నులకు పైగా గోధుమ ధాన్యాన్ని విక్రయించింది. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద 22 లక్షల టన్నుల గోధుమలను సేకరించి ఈ – వేలానికి పెట్టింది. ఇందులో రెండు రోజుల్లో 9.2 లక్షల టన్నుల గోధుమలు అమ్ముడయ్యాయి.
దేశవ్యాప్తంగా ఈ – వేలం జరుగుతోంది. వేలంలో తొలుత వెయ్యి మందికి పైగా బిడ్డర్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రతి బుధవారం గోధుమల విక్రయానికి ఈ-వేలం నిర్వహిస్తారు. ఇది మార్చి రెండో వారం వరకు కొనసాగుతుంది. గోధుమల అధిక ధరను నివారించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ – వేలం ఏర్పాటు చేసింది. దీని ప్రభావం మొదటి వారంలో కనిపిస్తుంది.
ధర చాలా పెరిగితే రైతులు తమ గోధుమలను ఎఫ్‌సిఐకి విక్రయించడానికి ముందుకు రాకపోవచ్చు. ఇలాంటప్పుడు ప్రభుత్వానికి గోధుమలు కొనడం కష్టమనే లెక్క కూడా గోధుమల వేలం వెనుక ఉంది. జనవరి 25న ఫుడ్ కార్పొరేషన్ ఓపెన్ మార్కెట్ సేల్ పథకం కింద మొత్తం 3 కోట్ల టన్నుల గోధుమలను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గోధుమ ధర 6 శాతం తగ్గింది.
ఫుడ్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఇది రైతుల నుండి కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాలను సేకరిస్తుంది. సాధారణంగా వీటిని వివిధ ప్రభుత్వ ఆహార పథకాలకు ఉపయోగిస్తారు. దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు, ఫుడ్ కార్పొరేషన్ తన స్టాక్‌లలో కొన్నింటిని మార్కెట్‌కు విడుదల చేయవచ్చు .
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి