AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency Notes: రూ.100, రూ.200, రూ.500 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

భారతీయ కరెన్సీ నోట్లనును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అనేక నకిలీ నోట్ల గురించి వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే..

Currency Notes: రూ.100, రూ.200, రూ.500 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
Rbi
Subhash Goud
|

Updated on: Feb 04, 2023 | 4:52 PM

Share

భారతీయ కరెన్సీ నోట్లనును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అనేక నకిలీ నోట్ల గురించి వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది దగ్గర చిరిగిపోయిన నోట్లు, నోట్లపై ఏదైనా మరకలు ఉండటం లాంటివి ఉంటాయి. అలాంటి సమయంలో అవి ఎవ్వరు కూడా తీసుకోరు. ఒక వేళ ఒక్కడైనా చెల్లుబాటు చేద్దామని ప్రయత్నించినా తీసుకోరు. అలాంటి నోట్లు ఉన్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అలాంటి నోట్లను సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉందని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు సరికొత్త నోట్లను పొందుతారు. ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ట్వీట్ చేసింది.

సమీప శాఖలో సంప్రదించాలి

మీరు కూడా పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లను మార్చాలనుకుంటే ఇప్పుడు మీరు ఈ పనిని సులభంగా చేసుకోవచ్చని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారిక ట్విట్‌లో తెలిపింది. మీరు మీ దగ్గరలోని బ్రాంచ్‌ను సంప్రదించవచ్చని బ్యాంక్ తెలిపింది. ఇక్కడ మీరు నోట్లు, నాణేలను మార్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రూల్స్ ప్రకారం.. మీ దగ్గర కూడా పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లు ఉంటే, మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు మీరు బ్యాంకులోని ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా అటువంటి నోట్లను మార్చుకోవచ్చు. మీ నోట్‌ని మార్చుకోవడానికి ఎవరైనా బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే మీరు దీనిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. నోటు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దాని విలువ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి.

ఆర్బీఐ వివరాల ప్రకారం.. ఏదైనా చిరిగిన నోటులో కొంత భాగం కనిపించకుండా పోయినప్పుడు లేదా రెండు కంటే ఎక్కువ ముక్కలను కలిగి ఉండి ఒకదానితో ఒకటి అతికించబడినప్పుడు మాత్రమే అంగీకరిస్తారు. కరెన్సీ నోటులోని కొన్ని ప్రత్యేక భాగాలు, సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ మొదలైనవి కూడా లేకుంటే మీ నోటు మార్చుకునేందుకు వీలుండదు. నిరుపయోగంగా మారిన నాసిరకం నోట్లను కూడా మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అలాగే ఆర్బీఐ కార్యాలయం నుంచి కూడా మార్చుకోవచ్చు. బాగా కాలిపోయిన నోట్లను మార్చవచ్చు. కానీ బ్యాంకు వాటిని తీసుకోదు. మీరు వాటిని ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లాలి. మీ నోట్‌కు జరిగిన నష్టం నిజమైనదేనని, ఉద్దేశపూర్వకంగా దెబ్బతినలేదని సంస్థ ఈ విషయాలను ఖచ్చితంగా తనిఖీ చేస్తుంది. అప్పుడే ఇలాంటి నోట్లను మార్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!