PM Kisan Yojana: రైతులకు మోడీ సర్కార్ తీపి కబురు.. నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. సబ్సిడీపై యూరియా
దేశంలోని రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందే 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది..
దేశంలోని రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందే 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున అధికారికంగా సమాచారాన్ని కూడా జారీ చేసింది. అక్టోబర్ 17న (నేడు) రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్ సదస్సు, ఎగ్జిబిషన్‌ను, 600 ‘పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ పీఎం కిసాన్ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
రైతుల సంక్షేమం పట్ల ప్రధాన మంత్రి నిరంతరం నిబద్ధతతో ఉన్నారని ప్రతిబింబిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి 12వ విడత మొత్తాన్ని విడుదల చేస్తారు. 8.5 కోట్ల మందికిపైగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 16,000 కోట్లను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు రూ.6000 సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటి వరకు అర్హులైన రైతు కుటుంబాలు రూ. పీఎం-కిసాన్ కింద 2 లక్షల కోట్లు అందాయి.
#PMModi to inaugurate #PMKisanSammanSammelan in Delhi today, inaugurate 600 PM Kisan Samruddhi Kendras
PM to also release PM-KISAN Funds worth Rs 16,000 crores, launch PM Bhartiya Jan Urvarak Pariyojana-One Nation One Fertilizer & Agri Startup Conclave & Exhibition#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) October 17, 2022
మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను కేటాయించింది. ఈ నంబర్‌ల ద్వారా రైతులు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అయితే అగ్రికల్చర్ ఇండియా తన అధికారిక ట్వీట్‌లో దేశంలోని రైతులు పీఎం కిసాన్ యోజన స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ఓ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకున్న రైతులు155261 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా దరఖాస్తు స్థితితో పాటు ఇన్‌స్టాల్‌మెంట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవచ్చు.
డబ్బుల గురించి ఇలా తనిఖీ చేసుకోండి..
☛ ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి
☛ దీని తర్వాత మీరు కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపికను చేసుకోవాలి.
☛ మీరు ‘బెనిఫిషియరీ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
☛ ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
☛ ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నుండి ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత డేటాపై క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.
సబ్సిడీపైయూరియా సంచులు
ప్రధాన మంత్రి 600 ‘పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను’ ప్రారంభిస్తారు. ‘ఒకే దేశం, ఒకే ఎరువులు’ పథకం కింద ‘భారత్’ బ్రాండ్‌తో కూడిన సబ్సిడీ యూరియా సంచులను కూడా ప్రవేశపెడతారు. ఎరువుల రంగం కోసం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం కింద యూరియా, డి అమ్మోనియా ఫాస్ఫేట్ (డిఎపి), ఎంఓపి, ఎన్‌పికె సహా అన్ని సబ్సిడీ ఎరువులను దేశవ్యాప్తంగా ‘భారత్’ బ్రాండ్‌తో విక్రయించనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి