AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Cards: దేశ ప్రజలకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ఆసరా ఉండేలా మోడీ సర్కార్‌ పథకాలను రూపొందిస్తోంది. ఇక అక్టోబర్‌ 17న సాయంత్రం 4 గంటలకు..

Ayushman Cards: దేశ ప్రజలకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ
PM Modi
Subhash Goud
|

Updated on: Oct 17, 2022 | 9:33 AM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ఆసరా ఉండేలా మోడీ సర్కార్‌ పథకాలను రూపొందిస్తోంది. ఇక అక్టోబర్‌ 17న సాయంత్రం 4 గంటలకు ప్రధాన నరేంద్ర మోడీ గుజరాత్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. ఈ పథకం కింద దేశంలోని పేద వర్గాలకు ప్రభుత్వం ఉచిత చికిత్సను అందిస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఆయుష్మాన్ కార్డును జారీ చేస్తుంది.

ఈ ప్లాన్ ఏమిటి?

వాస్తవానికి ఈ ఆయుష్మాన్ పథకం కింద అర్హులైన వ్యక్తుల ఆయుష్మాన్ కార్డులు తయారు చేయబడతాయి. అప్పుడు కార్డుదారుడు రూ. 5 లక్షల వరకు ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు. దీని కోసం మీరు ఈ కార్డు పొందేందుకు అర్హులా ? కదా అనే విషయాన్ని తెలుసుకోవాలి.

ఈ విధంగా అర్హతను తనిఖీ చేయండి:-

-మీరు ఆయుష్మాన్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా అధికారిక పోర్టల్ కి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

-తర్వాత ఇక్కడ మీరు ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.

-ఇప్పుడు మీరు ఇక్కడ రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీరు మొదట మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, రెండవదానిలో మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. అప్పుడు మీకు అర్హత ఉందా లేదా? అనేది తెలిసిపోతుంది. అర్హత ఉంటే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే ప్రధాని మోడీ ఈ రోజు పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌లో భాగంగా 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రధాని మోడీ. ఉదయం 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్‌ సదస్సు, ఎగ్జిబిషన్‌ను, 600 ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల’ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ పీఎం కిసాన్‌ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి