AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. పెరిగిన రుణ రేటు.. ఇక రుణాలు మరింత ప్రియం

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోట్లాది మంది ఖాతాదారులకు చేదువార్త. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. బ్యాంక్ తన..

SBI: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. పెరిగిన రుణ రేటు.. ఇక రుణాలు మరింత ప్రియం
SBI సీనియర్ సిటిజన్‌లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 bps వడ్డీ రేటును అందించనుంది. తాజా సవరణ తర్వాత సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 3.5% నుంచి గరిష్టంగా 7.25% వరకు వడ్డీని పొందుతారు.
Subhash Goud
|

Updated on: Oct 16, 2022 | 7:50 PM

Share

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోట్లాది మంది ఖాతాదారులకు చేదువార్త. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్‌)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు అక్టోబర్ 15, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఎంసీఎల్‌ఆర్‌ రేటు పెంపు తర్వాత, రేటు ఒక నెల, మూడు నెలల కాలానికి 7.35 శాతం నుండి 7.60 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఆరు నెలల కాలానికి 7.65 శాతం నుండి 7.90 శాతానికి పెరిగింది. మరోవైపు ఏడాది కాలానికి 7.70 శాతం నుంచి 7.95 శాతానికి పెంచారు. రెండేళ్ల కాలవ్యవధికి రుణ రేటు 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. కాగా, మూడేళ్ల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 8 శాతం నుంచి 8.25 శాతానికి పెంచారు.

MCLR అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. బ్యాంకులు రుణాలను అందించడానికి ఇది అంతర్గత సూచన రేటు. బ్యాంక్ 30 సెప్టెంబర్ 2019 వరకు ఎంసీఎల్‌ఆర్‌ లింక్డ్ హోమ్ లోన్‌లను అందిస్తోంది.

ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్, ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటు లేదా బ్యాంకులకు స్వల్పకాలిక రుణాల రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?