PM Kisan: రైతులకు అలర్ట్.. గడువు గుర్తుందా ?.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు..
పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా వచ్చే 12 విడత నగదు కోసం రైతులు e-KYCని పూర్తిచేయాల్సి ఉంటుంది. జూలై 31 లోపు అన్నదాతలు e-KYCని కంప్లీట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అర్హులైన రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రతి ఏడాది రూ.6000ను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం. అయితే ఈ నగదును ఒకేసారి కాకుండా విడతల వారిగా అందిస్తుంది. ఇప్పటివరకు 11 విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో 12వ విడతను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అర్హులైన రైతులను గుర్తించేందుకు కేంద్రం e-KYCని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు జూలై 31న గడువు కూడా పెట్టింది.
పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా వచ్చే 12 విడత నగదు కోసం రైతులు e-KYCని పూర్తిచేయాల్సి ఉంటుంది. జూలై 31 లోపు అన్నదాతలు e-KYCని కంప్లీట్ చేయకపోతే వారికి 12వ విడత నగదు రాదు. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది.
ముందుగా రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అక్కడ e-KYC ట్యాబ్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అంతే మీ e-KYC అప్డే్ట్ పూర్తవుతుంది.
ఇక ఇప్పటికే అనర్హులైన రైతుల దగ్గర్నుంచి పీఎం కిసాన్ నగదును రికవరీ చేసే పనిలో ఉంది కేంద్రం. ఇప్పటివరకు ప్రయోజనాలు పొందిన అనర్హులకు నోటీసులు సైతం పంపింది. వారు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని.. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నోటీసులలో పేర్కొంది ప్రభుత్వం.