SpiceJet: 50 శాతం విమానాలను 8 వారాల పాటు నిషేధం.. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం సీరియస్ యాక్షన్..
DGCA Action: 50 శాతం మాత్రమే స్పైస్‌జెట్ విమానాలు ఎగరేందుకే అనుమతి ఇవ్వాలని DGCA నిర్ణయించింది. 50 శాతం విమానాలను 8 వారాల పాటు నిషేధించింది. ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి..
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సీరియస్ యాక్షన్ తీసుకుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). 8 వారాల పాటు 50 శాతం మాత్రమే స్పైస్‌జెట్ విమానాలు ఎగరేందుకే అనుమతి ఇవ్వాలని DGCA నిర్ణయించింది. 50 శాతం విమానాలను 8 వారాల పాటు నిషేధించింది. ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. సాంకేతిక లోపాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. స్పైస్‌జెట్ విమానాల అంతర్గత భద్రతపై విచారణ జరిపిన DGCA ఈ చర్యలు తీసుకుంది. తమ విమానంలో లోపాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. డీజీసీఏ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఏప్రిల్ 1 నుంచి జులై 5 మధ్య జరిగిన ఘటనను కూడా ప్రస్తావించారు. స్పైస్‌జెట్ సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మకమైన విమాన రవాణా సేవలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని DGCA తెలిపింది. దీన్ని నివారించడానికి ఎయిర్‌లైన్ చర్యలు తీసుకుంటోందని.. అయితే సురక్షితమైన, నమ్మకమైన విమాన సేవ కోసం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆర్డర్ పేర్కొంది.
స్పైస్‌జెట్ ప్రకటన
DGCA చర్యల తర్వాత స్పైస్‌జెట్ ఒక ప్రకటన విడుదల చేసింది. మాకు డిజిసిఎ ఆర్డర్ వచ్చిందని.. రెగ్యులేటర్ సూచనల మేరకు తాము పని చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత తక్కువ ప్రయాణ కాలం కారణంగా, ఇతర విమానయాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా విమాన కార్యకలాపాలను ఇప్పటికే రీషెడ్యూల్ చేసింది. కాబట్టి, మా విమానాల నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. రాబోయే రోజులు, వారాల్లో మా విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తమ ప్రయాణీకులకు హామీ ఇచ్చింది. ఈ ఆర్డర్ ఫలితంగా ఏ విమానమూ రద్దు చేయబడలేదని తెలిపింది.
DGCA curtails SpiceJet’s flights to 50 pc
Read @ANI Story | https://t.co/icAZgh7e1f#DGCA #Airlines #SpiceJet #flights pic.twitter.com/82ABXECBgE
— ANI Digital (@ani_digital) July 27, 2022
జూలై 12న స్పైస్‌జెట్‌కు చెందిన దుబాయ్-మధురై విమానానికి విమానం ముందు చక్రంలో లోపం ఏర్పడింది. దీనికి ముందు, విమానాలపై ప్రశ్నలు లేవనెత్తే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఎనిమిది ఘటనలపై డీజీసీఏ జూలై 6న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చౌకైన సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ సురక్షితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన విమాన సేవలను అందించడంలో విఫలమైందని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..