PF UAN Number: మీరు పీఎఫ్‌ అకౌంట్‌ యూఏఎన్‌ నెంబర్‌ను మర్చిపోయారా..? సింపుల్‌ ఇలా చేయండి

ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగా ఉద్యోగులకు పీఎఫ్‌కు సంబంధించిన 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను..

PF UAN Number: మీరు పీఎఫ్‌ అకౌంట్‌ యూఏఎన్‌ నెంబర్‌ను మర్చిపోయారా..? సింపుల్‌ ఇలా చేయండి
మీ ఫండ్‌ను ఉపసంహరించుకోవడానికి 'PF అడ్వాన్స్ (ఫారం 31)' ఎంచుకోండి. అవసరమైన మొత్తం, ఉద్యోగి చిరునామాను నమోదు చేయండి
Follow us

|

Updated on: Oct 08, 2022 | 6:32 PM

ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగా ఉద్యోగులకు పీఎఫ్‌కు సంబంధించిన 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేసే విషయం తెలిసిందే. అయితే చాలా మంది తమ యూఏఎన్‌ నెంబర్‌ను మర్చిపోతుంటారు. అలాంటి సమయంలో మీ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునేందుకు మీరు లాగిన్‌ కాలేరు. కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. పీఎఫ్‌ అకౌంట్‌ సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారినా అదే నంబర్‌ కొనసాగుతుంటుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా యూఏఎన్‌ ఒక్కటే ఉంటుంది. ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అయితే ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్‌ఏ నెంబర్‌తో కేవైసీ వివరాలు లింక్‌ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్‌ నెంబర్‌ మర్చిపోతే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమయంలో ఉద్యోగులు ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మర్చిపోయిన పీన్‌ నెంబర్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి.

☛ ఈపీఎఫ్‌ అకౌంట్‌దారులు ముందుగా అధికారిక వెబ్‌ సైట్‌ ఈపీఎఫ్‌లో పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి. హోమ్‌ పేజీలో ఉన్న నో యు యుఏఎన్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.

☛ మెంబర్ ఐడీ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మెంబర్ ఐడీ శాలరీ స్లిప్‌లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

☛ గెట్ ఆథరైజేషన్ పిన్‌పై క్లిక్ చేయాలి.

☛ పీఎఫ్ మెంబర్ ఐడీతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు ఒక పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.

☛ వాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.

☛  యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

యూఏఎన్‌ లేకుండా పీఎఫ్‌ బ్యాలెన్స్ ఎలా చెక్​ చేసుకోవాలి..?

☛ ఈపీఎఫ్​ఓ హోమ్​ పేజీ ని లాగిన్ అవ్వండి

☛ మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్​ హియర్​ టు నో యువర్​ పీఎఫ్​ బ్యాలెన్స్​’ పై క్లిక్ చేయండి.

☛ వెంటనే epfoservices.in/epfo/ పేజ్​ ఓపెన్​ అవుతుంది. అక్కడ ‘మెంబర్​ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్’ను ఎంచుకోండి.

☛ అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్​ కార్యాలయం, కోడ్​, పీఎఫ్​ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి.

☛ సబ్​మిట్ చేసే ముందు ఐ అగ్రీ పై క్లిక్ చేయండి.

☛ అప్పుడు మీ స్క్రీన్​పై ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

యూఏఎన్‌ నెంబర్‌తో పీఎఫ్‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..?

ఎస్ఎంఎస్ ద్వారా.. ఈపీఎఫ్ఓ చందాదారుడికి యూఏఎన్‌ నెంబర్​ ఉంటే, అప్పుడు SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్ చెక్​ చేసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN అని ఎస్​ఎమ్​ఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్‌కు పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు.

మొబైల్ నెంబర్ ద్వారా.. అలాగే యూనివర్సల్​ అకౌంట్ నంబర్​ లేకుండానే బ్యాలెన్స్​ చెక్​ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మీ యూఏఎన్‌ నెంబర్​మీకు గుర్తుకు లేకపోయినా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ‌దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-229014016 కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీరు ముందుగానే​ యూఏఎన్‌ పోర్టల్‌లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్