5

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులున్నాయి.. తాజా రేట్ల వివరాలు

Petrol Diesel Price Today: గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ధరలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు..

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులున్నాయి.. తాజా రేట్ల వివరాలు
Today Petrol, Diesel Prices in India
Follow us

|

Updated on: Sep 26, 2022 | 8:36 AM

Petrol Diesel Price Today: గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ధరలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు సెప్టెంబర్ 26 సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35 ఉండగా, పెట్రోల్‌ ధర రూ.94.28 ఉఎంది. కోల్‌కతాలో రూ.106.03 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.76 ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.24 ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82 ఉంది.

మీరు ఇంట్లో కూర్చొని పెట్రోల్-డీజిల్ రేట్లను తనిఖీ చేయవచ్చు. అన్ని చమురు కంపెనీలు SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ధరను తనిఖీ చేయడానికి, ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.

మే 22న ఆర్థిక మంత్రి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలో చివరి మార్పు జరిగింది. మే 21న లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించారు. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.8.69, డీజిల్ ధర రూ.7.05 తగ్గింది.

ఇవి కూడా చదవండి

పెట్రోల్ పై ఎంత పన్ను విధిస్తారు?

రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13. లీటరుకు 20 పైసలు ధర. ఎక్సైజ్ సుంకం రూ.19.90, వ్యాట్ లీటరుకు రూ.15.71. డీలర్ కమీషన్ లీటరుకు రూ.3.78. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

డీజిల్‌పై పన్ను ఎంత?

మరోవైపు రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. దీని మూల ధర లీటరుకు రూ.57.92. లీటరు ధర రూ.0.22, ఎక్సైజ్ డ్యూటీ రూ.15.80, వ్యాట్ రూ.13.11. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.57. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి